Telangana: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. పోలీసుల కీలక నిర్ణయం..

|

Dec 01, 2022 | 7:06 PM

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసి చాలా రోజులైంది. ఆయన కుటుంబ సభ్యులు ఉదయం ఐటీ విచారణకు హాజరై సాయంకాలానికి ఇళ్లకు..

Telangana: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. పోలీసుల కీలక నిర్ణయం..
Laptop
Follow us on

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసి చాలా రోజులైంది. ఆయన కుటుంబ సభ్యులు ఉదయం ఐటీ విచారణకు హాజరై సాయంకాలానికి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కానీ సోదాల్లో కీ పాయింట్‌గా మారిన ల్యాప్‌టాప్‌ మాత్రం ఇంకా బోయిన్‌పల్లి పీఎస్‌లోనే ఉంది. అది ఎవరిది..? దాన్ని ఎవరూ.. ఎందుకు తీసుకెళ్లడం లేదన్నది అంతుపట్టడం లేదు. తలనొప్పిగా మారిన ల్యాప్‌టాప్‌ వ్యవహారాన్ని బోయిన్‌పల్లి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పీఎస్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌ను రేపు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాలని డిసైడ్ అయ్యారు.

మల్లారెడ్డి ఇళ్లు, విద్యాసంస్థల సోదాల సమయంలో తన ల్యాప్‌టాప్‌ మిస్ అయిందని బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐటీ అధికారి రత్నాకర్‌. అందులో కీలక సమాచారం ఉందన్నారాయన. అయితే ఫిర్యాదు చేసిన గంటల్లోనే ల్యాప్‌టాప్‌ పీఎస్‌లో ప్రత్యక్షమైంది. అది కూడా మల్లారెడ్డి అనుచురులు వదిలెళ్లారు. ఆ తర్వాత ఆ ల్యాప్‌టాప్‌ తనది కాదని స్పష్టం చేశారు రత్నాకర్‌. అదే మాట మంత్రి మల్లారెడ్డి కూడా రిపీట్ చేశారు.

ఇంతకీ ఆ ల్యాప్‌టాప్‌ ఎవరిది? ఐటీ అధికారి రత్నాకర్ అసలు ల్యాప్‌టాప్‌ ఎలా మిస్ అయింది? తనది కాని ల్యాప్‌టాప్‌ పీఎస్‌కి ఎందుకొచ్చిందన్నది పోలీసులకు తలనొప్పిగా మారింది. రేపు ఆ ల్యాప్‌టాప్‌ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించబోతున్నారు. ఆ రిపోర్ట్‌ ఆధారంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..