Target Bounce Bike: ఆ కంపెనీ బైక్‌లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్న దొంగ.. ఎట్టకేలకు ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు..

|

Feb 20, 2021 | 3:10 PM

Target Bounce Bike: బౌన్స్ కంపెనీ ద్విచక్ర వాహనాలు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ ద్విచక్ర వాహనాల దొంగను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Target Bounce Bike: ఆ కంపెనీ బైక్‌లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్న దొంగ.. ఎట్టకేలకు ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు..
Follow us on

Target Bounce Bike: బౌన్స్ కంపెనీ ద్విచక్ర వాహనాలు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ ద్విచక్ర వాహనాల దొంగను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. దొంను మీడియా ముందు ప్రవేశపెట్టిన కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు.. దోపిడీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. శంకర్‌పల్లి మైతాబ్ ఖాన్ గూడకు చెందిన అవ్సలి నరేష్(28) గతంలో బౌన్స్ కంపనీ ద్విచక్ర వాహనాల సంస్థలో సాంకేతిక విభాగంలో టెక్నిషియన్‌గా పని చేసేవాడు. ఉద్యోగం మానేశాక సొంత ఊరిలో ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా షెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. తనకు బౌన్స్ సంస్థలో పని చేసిన అనుభవంతో కూకట్‌పల్లి, కె.పి.హెచ్.బి కాలనీలలో నిర్మానుష్య ప్రదేశాలలో పార్క్ చేసి ఉన్న బౌన్స్ బైక్ లను గుర్తించి, వాటిలో ఉన్న జిపిఎస్ ట్రాకర్ తీసివేసేవాడు.

ఆ బైకులను స్టార్ట్ చేసి ఊరికి తీసుకుని వెళ్ళి ఆ బైక్‌ల రంగులను మార్చేవాడు. ఈ విధంగా ఐదు బైకులను అపహరించాడు. బైకులు చోరీ అయినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి గురైన ఓ బైక్ జిపిఎస్ ట్రాకర్ లోకేషన్ ద్వారా, బైక్ మైతాబ్ ఖాన్ గూడలో ఉన్నట్లు గుర్తించారు. ఈ దోంగతనాన్ని పాత ఉద్యోగులే చేసే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు.. ఆ ఊరి దగ్గరలో గల పాత ఉద్యోగుల వివరాలు సేకరించారు. అలా బౌన్స్ బైక్‌లను నరేష్ చోరీ చేశాడని గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నామని ఏసిపి సురేందర్ రావు తెలిపారు.

Also read:

‘దృశ్యం 2’ను వదలని పైరసీ బూతం… రిలీజ్ అయిన గంటల్లోనే తమిళ్ రాకర్స్‏లో మోహన్ లాల్ సినిమా..

Raisins or Grapes : ద్రాక్ష, ఎండుద్రాక్షలు వేటికవే ప్రత్యేకం.. ఆరోగ్యానికి ఈ రెండిటిలో ఏవి మంచివో తెలుసా..