Hyderabad: బొల్లారం చిన్నారి హత్య కేసులో బిగ్ అప్‌డేట్.. నిందితుడు విక్రమ్ అరెస్ట్
హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిటిన బొల్లారం చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారిని కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులో పడేసి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు విక్రమ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అసలేం జరిగింది?
సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు విల్లా ఆర్కిడ్స్ అపార్ట్‌మెంట్‌లో పేరెంట్స్‌తో కలిసి నివసిస్తున్న ఆరేళ్ల చిన్నారిని.. అక్కడ గతంలో వాచ్‌మెన్‌గా పని చేసిన విక్రమ్ అనే బిహార్‌కు చెందిన యువకుడు కిడ్నాప్ చేసి మరీ హత్య చేశాడు. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారనే కక్షతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు.
అయితే అపార్ట్‌మెంట్‌లో ఉన్న బాలికను చాక్లెట్ ఆశ చూపి విక్రమ్ కిడ్నాప్ చేసినట్టు .. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించారు అధికారులు. అయితే కిడ్నాప్ తర్వాత చిన్నారి పేరెంట్స్‌ను రూ.20లక్షలు డిమాండ్ చేశాడ నిందితుడు.. అయితే దొరికిపోతాననే భయంతో చిన్నారికి కాళ్లు చేతులు కట్టేసి.. ఎవరికీ డౌట్ రాకుండా అపార్ట్‌మెంట్‌లోని నీటి సంపులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు.
అయితే బాలికను నీటిలో పడేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపిన విక్రమ్.. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తొలుత బీహార్‌కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత నిందితుడి కోసం తీవ్రంగా గాలించి తాజాగా విక్రమ్‌ను అరెస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.