AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద మ‌న‌సులు.. తండ్రి ఎన్టీఆర్ కట్టించిన ఇంటి స్థలాన్ని రోడ్డు కోసం ఇచ్చిన బాలకృష్ణ!

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన రహదారుల విస్తరణ పనులకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యాలు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. బాలకృష్ణ నివాసం వద్ద సుమారు 862.77 చదరపు గజాలు, శబ్దాలయ స్టూడియో నుంచి 608 చదరపు గజాలు, భవ్య కన్‌స్ట్రక్షన్స్ నుంచి 341.33 చదరపు గజాల స్థలాన్ని రహదారుల విస్తరణ కోసం సేకరించారు. ఈ పనులతో జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పశ్చిమ ఐటీ కారిడార్ వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి.

పెద్ద మ‌న‌సులు.. తండ్రి ఎన్టీఆర్ కట్టించిన ఇంటి స్థలాన్ని రోడ్డు కోసం ఇచ్చిన బాలకృష్ణ!
Balakrishna Gives Land For Road Widening
Prabhakar M
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 8:52 AM

Share

అవి న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న నిర్మాణాలు.. గ‌జం నాలుగైదు ల‌క్ష‌లు ప‌లికే స్థ‌లాలు.. ఆ స్థ‌లాల‌తో వారికెంతో అనుబంధం.. అయినా ప్ర‌జావ‌స‌రాల నిమిత్తం ఆ స్థ‌లాల‌ను వారు పెద్ద మ‌న‌సుతో వ‌దులుకున్నారు. ప‌రిహారం రూపంలో చ‌ట్ట‌బ‌ద్ధంగానే రూ.కోట్లు తీసుకునే అవ‌కాశం ఉన్నా, దానిపై వారు పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. ప్ర‌భుత్వం ఇచ్చే టీడీఆర్‌ల‌తో స‌రిపెట్టుకున్నారు. ఇంత‌కు వారు ఎవ‌రంటే సినీ హీరో బాల‌కృష్ణ‌.. శ‌బ్దాల‌య స్టూడియో యాజ‌మాన్యం, భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్చ‌న్ యాజ‌మాన్యం.. ట్రాఫిక్ ర‌ద్దీతో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌గ‌ర వాసుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ న‌గ‌రంలో అనేక ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తోంది. ర‌హ‌దారుల విస్త‌ర‌ణ చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం కోసం తొలుత తాత్కాలికంగా వన్ వే విధానాన్ని పాటించింది. అది సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో దానిని శాశ్వ‌తంగా మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో భ‌విష్య‌త్ లో పెరిగే ట్రాఫిక్‌, వ‌న్ వేలో మ‌రింత వేగంగా, సుర‌క్షితంగా వాహ‌నాల ప్ర‌యాణం సాగాలంటే ప‌లు చోట్ల ర‌హ‌దారుల‌ను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. కానీ అక్క‌డ ప్ర‌ముఖుల నివాసాలు… స్టూడియోలు ఉన్నాయి. త‌మ స్థ‌లాలు ఇవ్వ‌కుండా వారు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తే ఎన్ని సంవ‌త్స‌రాలైనా ఆ కేసులు తేలేవి కావు.. ఇక్క‌డ క‌ష్టాలు త‌ప్పేవి కావు. కానీ, ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన విజ్ఞ‌ప్తికి ఆ ప్ర‌ముఖులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఇప్పుడు పనులు ఊపందుకున్నాయి. ఇంత‌కీ ఆ ప్ర‌ముఖులెవ‌రో తెలుసా..?

జై బాల‌య్య అనేలా..

హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం.. నందమూరి బాల‌కృష్ణ పెద్దమనసు చాటుకున్నారు. కేబీఆర్ పార్క్ ప‌క్క‌న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 జంక్షన్ వద్ద బాల‌కృష్ణ ఇల్లు అంద‌రికీ తెలుసు.. ముఖ్య‌మంత్రి కాక‌ముందే 1982లో బాల‌కృష్ణ కోసం ఎన్టీఆర్ క‌ట్టించిన ఇల్లు అది.. ఆ నివాసం ద‌గ్గ‌రే ఎన్టీఆర్ త‌న అభిమానుల‌ను క‌లుసుకునే వారు.. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల వేడుక‌ల‌కు ఆ ఇల్లు వేదిక‌. ద‌శాబ్దాలుగా బాల‌కృష్ణ త‌న కుటుంబంతో ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు, నాలెడ్జ్ సిటీ (హైటెక్ సిటీ) వైపు వెళ్లే భారీ ట్రాఫిక్‌ను మళ్లించ‌డానికి బాల‌య్య ఇంటి ముందున్నదే కీల‌క‌మైన జంక్ష‌న్.. ఈ జంక్షన్‌ను వెడల్పు చేస్తే ఐటీ పార్కుల వైపు వెళ్లే మార్గాల్లో బాటిల్‌నెక్స్ (రద్దీ పాయింట్లు) నివారించవచ్చు. ప్రతిరోజూ ఐటీ హబ్‌లకు వెళ్లే వేలాది మంది ఉద్యోగుల ప్రయాణం సులువవుతుంది. కానీ ఇక్క‌డ జంక్ష‌న్ విస్త‌రించాలంటే బాల‌కృష్ణ ఇంటి స్థ‌లం అవ‌స‌రం.. ప్ర‌భుత్వం సంప్ర‌దించ‌గానే త‌న నివాసంలోని సుమారు 862.77 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు బాల‌కృష్ణ ముందుకొచ్చారు. ఆ స్థ‌లంలో ఉన్న ఒక భ‌వ‌నం స‌గానికి పైగా పోతోంది. ఖాళీ ప్ర‌దేశం పూర్తిగా పోతోంది. దీంతో ఇక్క‌డ నుంచి బాల‌య్య మకాం మార్చాల్చి వ‌స్తోంది. త‌న తండ్రి క‌ట్టించిన ఇల్లు.. తాను ద‌శాబ్దాలుగా ఉంటోన్న ఇల్లు.. అయినా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బాల‌య్య ముందుకు వ‌చ్చి స్థ‌లాన్ని ఇచ్చారు.

శ‌బ్దాల‌య సైతం..

కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ (ప్రధాన ప్రవేశ ద్వారం) వ‌ద్ద శ‌బ్దాల‌య స్టూడియో ఉంటుంది. ఈ జంక్షన్ వన్‌వే లూప్‌నకు మెయిన్ ఎంట్రన్స్‌గా ఉంది. పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్ (NFCL) వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ (JHCP) వైపు వెళ్లే భారీ ట్రాఫిక్ ఈ జంక్షన్ నుంచే వెళుతుంది. ఇక్క‌డకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఎటువంటి ఆటంకాలు లేని ప్రత్యేక ‘ఫ్రీ లెఫ్ట్’ల ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అలా చేస్తే వన్‌వే లూప్‌లోకి ప్రవేశించే వాహనాలు, ఇతర మార్గాల్లోకి వెళ్లే వాహనాలు వేగం తగ్గ‌కుండా ప్ర‌యాణించే వీలుంటుంది. ఇక్క‌డ ఈ ప‌నులు చేప‌ట్టాలంటే శ‌బ్దాల‌య స్టూడియో స్థ‌లం అవ‌స‌రం. ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తికి శ‌బ్దాల‌య యాజ‌మాన్యం ముందుకొచ్చి 608 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీక‌రించింది. దీంతో శ‌బ్దాల‌యా ప్ర‌హ‌రీతో పాటు ఖాళీ స్థ‌లం పూర్తిగా పోతోంది. అయినా శ‌బ్దాల‌య యాజ‌మ‌న్యం సానుకూలంగానే స్పందించింది.

భ‌వ్య‌మైన మార్గం..

జూబ్లీహిల్స్ ఇంట‌ర్న‌ల్ ఏరియాల‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, పశ్చిమ ఐటీ కారిడార్‌తో ఫిల్మ్ నగర్ జంక్షన్ అనుసంధానిస్తుంది. ఇక్క‌డ‌ జంక్షన్‌ను పునర్నిర్మిస్తే ఎదురెదురుగా వ‌చ్చే ట్రాఫిక్ తగ్గిపోతుంది. బ్యాంకింగ్, టెక్ హబ్‌ల వైపు వెళ్లే కార్పొరేట్ ట్రాన్స్‌పోర్ట్‌, ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా స‌జావుగా సాగిపోతాయి. ఇక్క‌డ‌ రోడ్డు వెడల్పు, ఛానలైజేషన్ పనులకు భవ్య కన్‌స్ట్రక్షన్స్ యాజ‌మాన్యం 341.33 చదరపు గజాల స్థలాన్ని ప్ర‌భుత్వానికి ఇచ్చింది. ఈ స్థ‌లంలోని ఉన్న భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ బిల్డింగ్ పూర్తిగా పోతోంది. కీల‌క‌మైన ప్రాంతంలోని త‌మ భ‌వ‌నం పూర్తిగా పోతున్నా భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ యాజ‌మాన్యం దాన్ని వ‌దులుకునేందుకు వెనుకాడ‌లేదు.

బాల‌కృష్ణ ఇల్లు, శ‌బ్దాల‌య స్టూడియో, భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్చ‌న్ స్థ‌లాల‌కు ప‌రిహారం చెల్లించాలంటే ప్ర‌భుత్వం రూ.వంద‌ల కోట్లును వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తికి వారు సానుకూలంగా స్పందించ‌డంతో ప‌రిహారం ఇబ్బంది లేకుండా పోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కేవలం టీడీఆర్ (Transferable Development Rights) ద్వారా ఆ ఆస్తుల‌ను సేక‌రించింది. ఆయా స్థ‌లాల్లో ఇప్ప‌టికే ప‌నులు ప్రారంభించింది. అయితే.. రోడ్ల విస్తరణకు బాల‌కృష్ణ, శ‌బ్దాల‌య స్టూడియో, భ‌వ్య క‌న్‌స్ట్ర‌క్షన్ స్థలాలను వదులుకోవడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్