
సరికొత్త వైట్‌బాడీ బోయింగ్ జెట్ 777-9 మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇది దేశ విమానయాన చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన ట్విన్-ఇంజిన్ జెట్‌గా ప్రశంసించబడిన ఈ విమానం.. అత్యంత అధునాతనమైన సాంకేతికతను కలిగి ఉంది. ఈ బోయింగ్ విమానం 777, 787 డ్రీమ్‌లైనర్ సంతతకు చెందినదిగా చెప్పవచ్చు. 2023లో అర్డర్ చేసిన అత్యాధునిక 777-9కి చెందిన 10 విమానాలను అందిపుచ్చుకోవడానికి ఎయిర్ ఇండియా సంస్థ సిద్ధంగా ఉంది.
ఈ వ్యూహాత్మక చర్య వల్ల తన విమాన సేవలను భవిష్యత్తులో మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను కూడా తీర్చడానికి ఇది దోహదపడుతుంది. అలాగే వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాల్లో బోయింగ్ 777X సంతతకి చెందిన, 777-8, 777-9 ప్యాసింజర్ మోడల్‌లను కలిగి ఉంది. 777-8 ఫ్రైటర్‌తో పాటు, ఆకట్టుకునే 450-ప్లస్ విమానాలను కూడా కలిగి ఉంది. వింగ్స్ ఇండియా 2024 ఆవిష్కరణలో భాగంగా బోయింగ్ కంపెనీ తన నిబద్దతను ప్రదర్శించనుంది. దీనిని ఇంటీరియన్‌ను గురువారం ప్రదర్శింపజేయనున్నట్లు తెలిపారు ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులు.
#Boeing 777-9 (N779XW) at #Hyderabad's Begumpet Airport#WingsIndia #begumpet pic.twitter.com/kVGY8WOUvx
— Dilip Madichatti (@DMadichatti) January 16, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..