AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో బంగారం, డబ్బు మాయం.. కట్ చేస్తే.. వెలుగులో ఊహించని ట్విస్ట్

కొల్లూరు పీఎస్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో ఉన్న ముప్పా ఇంద్రపస్థాన్ విల్లాస్‌లోని ఓ విల్లాలో చోరి జరిగింది. ఒరిస్సా కు చెందిన ప్రభాకర్ మాలిక్, తపన్ దాస్,సచీంద్ర దాస్, రతికంట దాస్ అనే నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు పోలీసులు. ప్రభాకర్ మాలిక్ బాధితురాలు ముల్కల సుజాత ఇంట్లో పనిచేస్తాడు.

ఇంట్లో బంగారం, డబ్బు మాయం.. కట్ చేస్తే.. వెలుగులో ఊహించని ట్విస్ట్
Hyderabad
Peddaprolu Jyothi
| Edited By: Rajeev Rayala|

Updated on: Jan 17, 2024 | 1:54 PM

Share

కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రాబరీ కేసును ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. ఇంట్లో పని చేసే వ్యక్తులే చోరీకి పాల్పడ్డ ట్లు గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కేజీ బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోరీ చేసినటువంటి సొత్తుతో తమ స్వగృహాలకు వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో పక్కా సమాచారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొల్లూరు పీఎస్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో ఉన్న ముప్పా ఇంద్రపస్థాన్ విల్లాస్‌లోని ఓ విల్లాలో చోరి జరిగింది. ఒరిస్సా కు చెందిన ప్రభాకర్ మాలిక్, తపన్ దాస్,సచీంద్ర దాస్, రతికంట దాస్ అనే నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు పోలీసులు. ప్రభాకర్ మాలిక్ బాధితురాలు ముల్కల సుజాత ఇంట్లో పనిచేస్తాడు..ఇంటి యజమాని అయిన సుజాత పని మనిషి ప్రభాకర్ మాలిక్ ను ఇంట్లోనే ఉంచి వ్యక్తిగత పనిమీద ఢిల్లీ వెళ్ళింది. ప్రభాకర్ మాలిక్ తన సహ నిందితులతో కలిసి చోరికి పాల్పడ్డారు.

A1 ప్రభాకర్ మాలిక్, A3 సచిందా దాస్,A4 రితికంఠాదాస్ ముగ్గురు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు A2 తపన్ దాస్ కడప జిల్లాకు చెందినవాడు. కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇంట్లో పని చేసే వ్యక్తి చోరికి పాల్పడ్డట్లు తెలిసింది. నలుగురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఇంట్లో లాకర్ ఓపెన్ చేసి బంగారం వజ్రభరణలు, నగదుతో ఉడాయించారు. బంగారం సుమారు అరవై లక్షలు విలువ ఉంటుదని మాదాపూర్ డీసీపీ  వినిత్ తెలిపారు. ఈ నెల 15 వ తేదీన నిందితుడు ప్రభాకర్ మాలిక్ గోపన్‌పల్లి పరిధిలో ఉన్నాడని మిగిలిన వారు తమ స్వగృహాలకు వెళ్లడానికి సిద్ధమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు పోలీసులు గోపనపల్లిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కేజీ బంగారం, రెండున్నర లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌తో తలుపులకు తాళం వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. అపరిచిత వ్యక్తులను ఇళ్లలోకి అనుమతించవద్దు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్ర పరుచుకోవాలి అని సూచించారు. కొత్త వ్యక్తులకు పనిలో పెట్టుకునేటప్పుడు వారి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ధృవీకరించుకోవాలి. చోరికి పాల్పడ్డ నిందితుల నుంచి  కిలో బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నాం అని అన్నారు పోలీసులు.