మహబూబూబాద్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని కురవి మండలం సూదనపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ పూజలు జరిగాయి. స్కూల్ ఉపాధ్యాయలుు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలోని తరగతి గది లోపల పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. ఇంకా ఆ తరగతి గదిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు జరిపారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలకు గేట్లు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటన కారణంగా విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తీవ్ర భయాందోళనుకు లోనయ్యారు.
కాగా, ఈ మధ్య కాలంలో పలు పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నిన్న(ఫిబ్రవరి 10) కూడా హనుమకొండ భీమదేవర పల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బీసీ కాలనీలోని కుదురుపాక రాజయ్య తెల్లవారుజామున లేచి చూడగా ఇంటి ముందు పూల చెట్టుకు తాయత్తు కట్టి కోడి తల, నల్ల బట్ట, జిల్లేడు ఆకులు , పసుపు కుంకుమ, మంత్రించిన నిమ్మకాయలు, దారాలు, కొబ్బరి కాయలు అన్ని కలిపి ఒక కసంచిలో పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..