పాదయాత్రకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయిస్తామన్న బండి సంజయ్.. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు..

నిర్మల్ జిల్లా బైంసాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్‌ సోమవారం తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. దీంతో హైకోర్టులో

పాదయాత్రకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయిస్తామన్న బండి సంజయ్.. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు..
Bandi Sanjay

Edited By:

Updated on: Nov 27, 2022 | 10:44 PM

నిర్మల్ జిల్లా బైంసాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్‌ సోమవారం తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. దీంతో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు బీజేపీ న్యాయ విభాగం కసరత్తు చేస్తోంది. రూట్ మ్యాప్ ఖరారు చేసి, అనుమతి ఇచ్చాక, శాంతి భద్రతల పేరుతో చివరి క్షణంలో అనుమతి నిరాకరించడం దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. తాము ఏర్పాటుచేసిన ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఏం దేవేంద్ర ఫడ్నవీస్ రానున్నారని, ఆయన పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ప్రకటించడం దారుణమన్నారు. ముందు అనుమతి ఇచ్చిన పోలీసులు సడన్‌గా ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. బైంసా సున్నిత ప్రాంతమంటున్నారని, అదేమి నిషేధిత ప్రాంతం కాదు కదా అన్న్నారు. బైంసా వెళ్తున్న బండి సంజయ్‌ను మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో బండి సంజయ్ కరీంనగర్ బయలుదేరారు.

సోమవారం మధ్యాహ్నం వరకు తమకు సమయం ఉందని, అప్పటివరకు అనుమతి కోసం వేచి చూస్తామన్నారు బండి సంజయ్. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లాలో పలుచోట్ల బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. రహదారులపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పలువురు బీజేపీ జిల్లా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులంటే తమకు గౌరవం ఉందని, వారి విజ్ఞప్తి మేరకు తాను కరీంనగర్ వెళ్లిపోతున్నట్లు తెలిపారు. నిర్మల్ లో  పార్టీ కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నారని,  ఎస్పీని కలవడానికి వెళ్తున్నా  అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.  భేషరతుగా కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించడం అప్రజాస్వామికమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. అలాగే పోలీసు ఉన్నతాధికారులతో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాగైనా సోమవారం నుంచి పాదయాత్ర జరిపితీరుతామంటున్నారు బీజేపీ నాయకులు. పోలీసులు మాత్రం బహిరంగ సభతో పాటు, పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టంచేశారు. దీంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తీర్పు ఎలా వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. బండి సంజయ్ బైంసా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని గోషమాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తెలంగాణ పోలీసులు ఫాంహౌస్ నుండి ఆర్డర్లు తీసుకోకుండా స్వతంత్రంగా ఎప్పుడు పని చేస్తారంటూ ట్విట్టర్ వేదికగా రాజాసింగ్ ప్రశ్‌నించారు. పోలీసుల తీరు రజాకార్ల మాదిరిగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ బైంసా సందర్శించకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..