Telangana: కేంద్రం నిధులతోనే తెలంగాన అభివృద్ధి.. ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Dec 03, 2022 | 5:49 AM

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లోని రాంపూర్ గ్రామంలో..

Telangana: కేంద్రం నిధులతోనే తెలంగాన అభివృద్ధి.. ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us on

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాంపూర్ గ్రామంలో గుడి, బడి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేకపోయినా.. బెల్టు షాపులు మాత్రం 10 నుంచి15 వరకు ఉంటున్నాయన్నారు. దందాలన్నీ కేసీఆర్‌ కుటంబానివేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే జాగాలను కబ్జా చేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ మోసపూరిత మాటలను నమ్మొద్దన్నారు. తాను చెప్పే వివరాలు తప్పైతే తనపై కేసు పెట్టాలంటూ సవాలు విసిరారు బండి సంజయ్. ప్రజల కోసం కొట్లాడతామని, ప్రజల కోసం ఉద్యమిస్తామని సంజయ్ తెలిపారు. ప్రజలంతా కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈసందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదని… దళితులకు 3 ఎకరాలు, దళితబంధు ఇవ్వలేదని విమర్శించారు.

ఢిల్లీలో కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునే ఈ దందా నడిపిస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. వందలాది మంది పేద ప్రజల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచారని దుయ్యబట్టారు.

తెలంగాణకు రెండు లక్షల 40వేల ఇళ్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కేసీఆర్ కట్టించడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ నేతలకు కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల జాగాలను గుంజుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడం తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..