Tarun Chugh : రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తృత పర్యటన, తెలంగాణలో బీజేపీ సునామీ తెస్తుందన్న తరుణ్‌చుగ్
Telangana MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్ బుధవారం సుడిగాలి పర్యటన జరిపారు. తెలంగాణలో రాబోతోన్న..
Telangana MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌చుగ్ బుధవారం సుడిగాలి పర్యటన జరిపారు. తెలంగాణలో రాబోతోన్న బీజేపీ సునామీలో టీఆర్‌ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు తరుణ్‌చుగ్. తెలంగాణకు కేంద్రం ఎంతో చేసిందన్న తరుణ్‌చుగ్.. కుటుంబపాలనపై, అవినీతిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణలో బీజేపీ సునామి తెస్తుందని చెప్పిన తరుణ్‌చుగ్… బీజేపీ సునామీలో అవినీతి తెరాస కొట్టుకొని పోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేసిన వాళ్ల బంగారు తెలంగాణ ఆశలు నెరవేరలేదని.. తెలంగాణ కోసం కేసీఆర్ ఏమి చేశారో చెప్పాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.