BRS vs BJP: ట్విట్టర్‌లో తెలంగాణ పొలిటికల్‌ పంచాయితీ.. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు రాములమ్మ పంచ్..

Vijaya Shanti: తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేతులు ఎత్తేశారని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు మాటలకు..

BRS vs BJP: ట్విట్టర్‌లో తెలంగాణ పొలిటికల్‌ పంచాయితీ.. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు రాములమ్మ పంచ్..
Vijaya Shanti On Harish Rao Comments

Updated on: May 31, 2023 | 8:37 AM

Vijaya Shanti: తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేతులు ఎత్తేశారని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు మాటలకు సమాధానమిచ్చారు విజయశాంతి. ‘‘బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్‌లో ఈటల చెప్పారు, చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు’’ అంటూ ఉద్ఘాటిస్తూ.. ‘నాటి ఆ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా..! చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా..! విశ్లేషించుకోవాలి..’ అని ట్వీట్ చేశారు.

ఇంకా ‘బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే.. చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదు..’ అని విజయశాంతి ఎద్దేవా చేస్తూ సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, మంగళవారం అచ్చంపేటలో జరిగిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ చేతులు ఎత్తేశారని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పేది వేదాంతం.. చేసేది రాద్ధాంతం.. ఆయన కడుపులంతా ఇసం అంటూ మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల గురించి నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలకు ఏం తెలుస్తుందని, తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా సెక్రటేరియట్‌ కట్టింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీకి భయం పట్టుకుందని మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..