BJP: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పొత్తులు, ఎత్తులు.. బీఆర్ఎస్ తీరుపై బీజేపీ ఫైర్..
బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక మతలబుందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలతో కమ్యూనిస్టులు జట్టు కట్టబోతున్నారని...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా కలకలం సృష్టి స్తున్నాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. పోటీకి దూరమని ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తోంది. బీఆర్ఎస్- ఎంఐఎం ఆడుతున్న నాటకాన్ని తాము ప్రజల ముందు ఎండగడతామని బీజేపీ ప్రకటించింది. ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయనని తొలుత ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ప్రకటించడం వెనుక మతలబుందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలతో కమ్యూనిస్టులు జట్టు కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. మరో వైపు తెలంగాణలో రెండు ఎంఎల్‌సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీపడాలని బీజేపీ నిర్ణయించింది.
బీఆర్ఎస్-బీజేపీ ఆరోపణలు ఇలా ఉండగా ఎంఐఎం తరపున ఎంఎల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్న మీర్జా రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అకర్బుద్దీన్ ఒవైసీ వెంటరాగా ఎంఐఎం కార్యకర్తలతో కలిసి ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం