TRS MLAs Poaching: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు.. హై కోర్ట్‌ను ఆశ్రయించిన బీజేపీ..

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది.

TRS MLAs Poaching: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు.. హై కోర్ట్‌ను ఆశ్రయించిన బీజేపీ..
Telangana High Court

Updated on: Oct 27, 2022 | 3:25 PM

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ వేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపద్యం లో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని పిటిషన్‌లో ఆరోపించారు. సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ ఈ కేసును సమగ్రంగా విచారించాలని హైకోర్టును పిటిసనర్ కోరారు. పిటీషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్.

తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసిపి, మొయినాబాద్ ఎస్‌హెచ్ఓ, కేంద్ర హోం ఆఫ్ఫైర్స్, సీబీఐ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్. ఈ కేసును సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జ్ తో గానీ సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పేర్కొన్నారు పిటిషనర్. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరుగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..