BJP: ఆ ట్రాప్‌లో పడొద్దు.. బీజేపీ నేతలకు ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ కీలక సూచనలు..

సోషల్ మీడియా ట్రాప్‌లో పడొద్దని పార్టీ నేతలకు సూచన చేశారు. పార్టీ అధ్యక్షుడు మార్పు.. ఈటల, వివేక్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారంటూ ప్రత్యర్థుల ప్రచారాన్ని పట్టించుకోవద్దని అన్నారు. కావాలనే ప్రత్యర్థులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని అన్నారు

BJP: ఆ ట్రాప్‌లో పడొద్దు.. బీజేపీ నేతలకు ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ కీలక సూచనలు..
TS BJP

Updated on: May 22, 2023 | 9:02 PM

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రాప్‌లో పడొద్దని పార్టీ నేతలకు సూచన చేశారు. పార్టీ అధ్యక్షుడు మార్పు.. ఈటల, వివేక్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారంటూ ప్రత్యర్థుల ప్రచారాన్ని పట్టించుకోవద్దని అన్నారు. కావాలనే ప్రత్యర్థులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని అన్నారు. నిజమైన బీజేపీ కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలు పట్టించుకోరని.. ఫొటోల కోసం కాదు.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. బండి సంజయ్‌ అధ్యక్షతన సోమవారం చంపాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగాయి.

పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు శివప్రకాశ్‌, తరున్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలతో పాటు, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. రాష్ట్రంలో పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశం కూడా చర్చించినట్లుగా తెలస్తోంది. ఎన్నికల ఎజెండాగా జరిగే సమావేశంలో జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాల విజయవంతం, జూన్‌లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో నిర్వహించే బహిరంగ సభలపైన తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం