Bandi Sanjay: ‘బీఆర్ఎస్ నాయకుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలి’.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

| Edited By: Ravi Kiran

Dec 17, 2023 | 9:12 AM

కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నేతల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలన్నారు బీజేపీ నేత బండి సంజయ్‌. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్‌ గల్లేంతనన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పోటీ వుంటుందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంకా వాడివేడి కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్‌ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. సీట్లు పెరిగాయి..ఓట్ల శాతం పెరిగిందంటన్న బీజేపీ.. ఎంపీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.

Bandi Sanjay: బీఆర్ఎస్ నాయకుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us on

కేసీఆర్‌ కుటుంబం సహా బీఆర్‌ఎస్‌ నేతల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలన్నారు బీజేపీ నేత బండి సంజయ్‌. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్‌ గల్లేంతనన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పోటీ వుంటుందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంకా వాడివేడి కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్‌ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. సీట్లు పెరిగాయి..ఓట్ల శాతం పెరిగిందంటన్న బీజేపీ.. ఎంపీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ దిశగా ముందడుగు వేశారు కూడా. ఎంపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారాయన. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లోక్‎సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారాయన. ఈ క్రమంలో ఆయన బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్‌ పరిస్థితి ‘ఖేల్‌ ఖతమ్‌ దుక్నం బంద్‌’ అన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారాయన. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గాయబవుతుందని బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు బండి సంజయ్‌. కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలన్నారాయన. లేకుంటే వారంతా దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్‌. కరీంనగర్‌ ఎంపీగా ఈసారి భారీ మెజార్టీ సాధించే దిశగా బండి సంజయ్‌ వ్యూహాలకు పదను పెట్టారు. ఏడు సెగ్మెంట్లలోని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.కేంద్రంలో మోదీ సర్కార్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు బండి సంజయ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..