MLA Raghunandan Rao: ‘తప్పుగా అర్థం చేసుకున్నారు’.. ఆ వ్యాఖ్యలపై రఘునందన్ రావు క్లారిటీ ఇదే..

|

Jul 03, 2023 | 9:58 PM

MLA Raghunandan Rao: అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ పరిస్థితి ఇలాగే ఉంది. చిట్‌చాట్‌లో హాట్‌హాట్‌ కామెంట్స్‌ చేశారు. తీరా ఆ మాటలు అగ్గి రాజేయడంతో ‘రఘునందన్‌ మంచిబాలుడు.. పార్టీకి సుశిక్షితుడైన కార్యకర్త..

MLA Raghunandan Rao: ‘తప్పుగా అర్థం చేసుకున్నారు’.. ఆ వ్యాఖ్యలపై రఘునందన్ రావు క్లారిటీ ఇదే..
BJP MLA Raghunandan Rao
Follow us on

BJP MLA Raghunandan Rao: అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ పరిస్థితి ఇలాగే ఉంది. చిట్‌చాట్‌లో హాట్‌హాట్‌ కామెంట్స్‌ చేశారు. తీరా ఆ మాటలు అగ్గి రాజేయడంతో ‘రఘునందన్‌ మంచిబాలుడు.. పార్టీకి సుశిక్షితుడైన కార్యకర్త..’ అని మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. నాకేం తక్కువ అని ఆఫ్‌ ది రికార్డ్ అంటే.. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాదని కెమెరా ముందు చెప్పుకొచ్చారు. అసలు ముందుగా ఆయన చేసిన డిమాండ్లు, క్వశ్చన్లు ఏంటి.. ఆయన వేసిన సెటైర్లు ఏంటి.. చివరికి ఇచ్చిన వివరణ ఏంటి..?

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండడం లేదనే మాట హాట్‌ టాపిక్ అయ్యింది. ఈటల, బండి వర్గాలుగా పార్టీ లీడర్లు విడిపోయిన నేపథ్యంలో.. రఘునందన్‌ కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం, పదవుల విషయంపై పెద్దలతో మాట్లాడాలని భావించడంతో ఏదో జరుగుతోందని అంతా భావించారు. పార్టీ అధ్యక్ష పదవి లేదా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అదీ కాకుంటే జాతీయ అధికార ప్రతినిధిగా తనను గుర్తించాలని రఘునందన్‌ ప్రపోజల్‌ పెట్టినట్టు ఢిల్లీ న్యూస్. 10 ఏళ్లుగా పార్టీకోసం సిన్సియర్‌గా పనిచేస్తున్నందున తానెందుకు పదవులకు అర్హుడిని కాదని ప్రశ్నిస్తూ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. కొన్ని విషయాల్లో కులమే తనకు శాపం కావచ్చన్నారు. ఈ క్రమంలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాథం అని ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పినా.. మీడియా ముందు అధ్యక్ష మార్పుపై నో కామెంట్ అన్నారు.


గతంలో దుబ్బాక ఎన్నికలలో తనకు ఎవరూ సాయం చెయ్యలేదని చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు రఘునందన్. ఇక మునుగోడులో 100 కోట్లు ఖర్చుపెట్టినా గెలవలేదని గుర్తు చేశారు. అదే 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. ఈ క్రమంలోనే తరుణ్‌చుగ్ బొమ్మలు కాదు… రఘునందన్, ఈటెల బొమ్మలుంటేనే జనం ఓట్లు వేస్తారు అనే మాటలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఇవన్నీ సంచలనంగా మారడంతో రఘునందన్‌ వివరణ ఇచ్చారు. సరదాగా మాట్లాడిన విషయాలను.. తప్పుగా అర్థం చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం జరిగిందని.. తాను క్రమశిక్షణకలిగిన కార్యకర్తననీ అన్నారు. తాను కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి నియోజకవర్గం సమస్యలపై మాట్లాడానన్నారు రఘునందన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 120 కోట్లతో దుబ్బాక నియోజకవర్గంలో సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద నిధులు ఇవ్వాలని కోరానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం