AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Forecast: అల్పపీడనం ప్రభావం.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్..14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ లిస్ట్‌లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి,

Weather Forecast: అల్పపీడనం ప్రభావం.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్..14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..!
Rains
Shiva Prajapati
|

Updated on: Jul 04, 2023 | 5:37 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ లిస్ట్‌లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీచేసింది.

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఈదురుగాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయన్నారు. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా మంగళవారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

మంగళవారం నాడు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

ఏపీలోనూ భారీ వర్షాలు..

ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణకేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా కృష్ణా, ఏలూరు, కోనసీమ​, ప్రకాశం, పల్నాడు, ఉభయగోదావరిజిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల, అనకాపల్లిజిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ వెల్లడించింది.