త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్ అనే సినిమా వస్తుంది.. బీజేపీ లీడర్ మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ (Islamabad) వరకు టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తున్న ఎంఐఎం కు టీఆర్ఎస్ (TRS) పార్టీ, పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు (Muralidhar Rao) ఆరోపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లో...
హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ (Islamabad) వరకు టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తున్న ఎంఐఎం కు టీఆర్ఎస్ (TRS) పార్టీ, పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు (Muralidhar Rao) ఆరోపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లో లవ్ జిహాద్ కేసులులో పురోగతి లేదన్న ఆయన.. బోధన్ లో హిందులను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. హిందువుల ప్రాణాలు, ఆస్తులు నష్టానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నిర్మల్, నిన్న భైంసా, నేడు బోధన్ వరకు ఉగ్రవాదుల కారిడార్ గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హిందువుల వలసలు ఎందుకు జరిగాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. త్వరలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా లాగా హైదరాబాద్ ఫైల్స్ అనే సినిమా కూడా వస్తుందని ఆక్షేపించారు.
మరోవైపు.. నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బోధన్ పట్టణంలో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ నేతలు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెల్లారేసరికి ఓ వర్గం నాయకులు విగ్రహ ప్రతిష్ఠపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులు, స్థానిక ప్రజలు అక్కడ భారీగా చేరుకోవడంతో పరిస్థితి మరింత్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకూ నచ్చజెప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు.
బోధన్ అల్లర్ల వెనుక పోలీసులు చేస్తున్న విచారణలో సంచలన విషయాలు బహిర్గతమవుతున్నాయి. అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. శివసేన కు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉందని నిర్ధరించారు. నెలరోజుల క్రితం కౌన్సిల్ లో విగ్రహ ప్రతిష్ఠానకు తీర్మానం పెట్టినప్పటికీ.. ఎప్పుడు ప్రతిష్ఠించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో వారం క్రితం గోపి, కౌన్సిలర్ శరత్ లు కలిసి విగ్రహ ప్రతిష్ఠకు ప్లాన్ వేశారు. కావాలనే ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అల్లర్ల వెనుకాల ఉన్న ఉద్దేశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. బోధన్ అల్లర్ల వెనుక ఎవరన్నా వారినీ వదిలిపెట్టమని అడిషనల్ డీజీ నాగి రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
Coronavirus: మహమ్మారి నుంచి భారీ ఊరట.. 50కి దిగువనే మరణాలు.. యాక్టివ్ కేసులెన్నంటే..
Market News: ఊగిసలాటలో సూచీలు.. స్వల్ప లాభాలతో ఆరంభం.. ఫోకస్ లో ఉన్న ఆ షేర్లు..