Telangana Politics: బీజేపీ నేత మురళిధర్ రావు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చుస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మరళిధర్ రావు.. ఇటివల కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్ తర్వాత మళ్లి అక్టివ్ గా కనిపిస్తున్నారు. అయితే అదే క్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన మనసులో మాట బయటపెట్టారు. అప్పటి నుండి బీజేపీలో ఈ విషయంపై అకస్తికర చర్చ నడుస్తోంది.
అర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో పని చేసి బీజేపీలో చేరిన మురళిధర్ రావు జాతీయ స్థాయిలో పార్టీపై పట్టు బలంగా ఉంది. చాల మంది బీజేపీ అధ్యక్షులతో పని చేసిన అనుభవం ఉంది. పార్టీ జాతీయ ప్రాధన కార్యదర్శిగా పని చేసి, అనేక రాష్ట్రాలకు ఇంచార్జీగా ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇంచార్జీగా ఉన్న మురళిధర్ రావు కేవలం పార్టీ వ్యవస్థాగత నిర్ణయంపై మాత్రమే దృష్టి పెట్టారు. అయన ఇప్పటి వరకు ఎటువంటి ఎన్నికల్లో పోటి చేయలేదు.
అయితే ఇటివల మీడియా ప్రతినిధులతో మచ్చటిస్తు.. తాను వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేద్దాం అనుకుంటున్నానని తన అభీష్టాన్ని బయటపెట్టారు. అయితే, ఎక్కడి నుండి పోటి చేస్తారు? ఎమ్యేల్యేగా పోటి చేస్తారా? లేక.. ఎంపీగానా? అనేది చెప్పలేదు. అయితే మరళిధర్ రావు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చగా మారింది.
మరళిధర్ రావు సొంత ఊరు జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామం. ఇది హుజురాబాద్ అసెంబ్లి సెగ్మెంట్ లో పడుతుంది. ఇక్కడ బీజేపీ ఎమ్యేల్యేగా ఈటల ఉండడంతో.. అయన అసెంబ్లికి కాని పార్లమెంట్‌కు కానీ పోటి చేయాలనుకుంటే కరీంనగర్ సీటు ఉంటుందని, బండి ఎలాగో ఏమ్యేల్యేగా పోటీ చేస్తారు కాబట్లి ఇబ్బంది ఉండదనే చర్చ మొదలైంది. అయితే మోది రెండవ ప్రభుత్వంతో మంత్రి పదవి అశించిన మరళిధర్ రావుకు సమీకరణల దృష్ట్యా రాలేదు. అయితే రాజ్యసభ ఇచ్చి ఎంపీ ఇవ్వడం కష్టతరమైతుంది అని భావించిన మరళిధర్ రావు ప్రత్యక్ష ఎన్నికల్లో పొటీ చేయలని అలోచిస్తున్నారు అనే చర్చ కుడా ఉంది. తెలంగాణ కోటాలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో బీజేపి పుంజుకుంటే తిరిగి ఏమ్యేల్యేగా పోటి చేద్దామని అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఎంపీగా ఎన్నికైతే కేంద్ర మంత్రి అవడం ఈజీ అవుతుందని మరళిధర్ రావు అంచనాలు వేసుకున్నారని కూడ చర్చ నడుస్తోంది.
Also read:
AP Crime News: అమాయక మహిళలే టార్గేట్.. మాట్రిమోని సైట్‌లో చూసి వల వేస్తాడు.. చివరకు
NEIGRIHMS Jobs: నైగ్రిమ్స్‌లో 64 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు.. అర్హతలు, ఇతర వివరాలివే..
Breaking: తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు రీ-ఓపెన్..