BJP: తెలుగు రాష్ట్రాలపైనే బీజేపీ ఫోకస్.. ఆ పదవి కోసం పరిశీలనలో ఏపీ, తెలంగాణ నేతల పేర్లు..
Bharatiya Janata Party: తెలుగు స్టేట్స్‌పై ఫోకస్ డబుల్ చేసింది బీజేపీ. కర్నాటక ఓటర్ల వార్నింగ్‌తో అలెర్ట్ అయిన కమలదళం.. దక్షణాది భారతంలో తన ఉనికిని నిలుపుకేనేందుకు ఏపీ, తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు కాషాయ దళానికి కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు..

Bharatiya Janata Party: తెలుగు స్టేట్స్‌పై ఫోకస్ డబుల్ చేసింది బీజేపీ. కర్నాటక ఓటర్ల వార్నింగ్‌తో అలెర్ట్ అయిన కమలదళం.. దక్షణాది భారతంలో తన ఉనికిని నిలుపుకేనేందుకు ఏపీ, తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు కాషాయ దళానికి కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చేసింది హైకమాండ్. అదే టైమ్‌లో ఏపీ, తెలంగాణ నేతలకు కేంద్ర నాయకత్వలో ప్రాధాన్యత పెంచుకుంటూ పోతోంది.
బీజేపీ అజెండా మెయిన్ అజెండా ఒక్కటే!. కుదిరితే దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, లేదంటే ఎంపీ సీట్లు పెంచుకోవడం.. ఇదే లక్ష్యంతో అడుగులు వేస్తోంది కాషాయ పార్టీ. అందుకే తెలుగు లీడర్స్‌కి బీజేపీ జాతీయ కార్యవర్గంలో పెద్దపీట వేసింది. ఏపీ నుంచి సోము వీర్రాజుని, తెలంగాణ నుంచి బండి సంజయ్‌ని కేంద్ర నాయకత్వంలోకి తీసుకుంది. ఇప్పుడు మరో టాక్ ఢిల్లీలో రీసౌండ్ వస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి ఒకరిద్దరికి రాజ్యసభ సీటు, కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కనున్నట్టు వార్తలొస్తున్నాయ్..!
కొద్దిరోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న బీజేపీ అగ్రనేతలు… రాజ్యసభ ఖాళీల భర్తీపై కసరత్తు చేస్తోంది. గుజరాత్, బెంగాల్, గోవాల్లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో 5 సీట్లను గెలుచుకునే బలముంది బీజేపీకి. అయితే, ఈ ఐదింటిలో ఒకటి తెలుగు స్టేట్స్‌కి కేటాయిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది!. ఆ ఒక్కటీ ఎవరికి దక్కబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది..! అయితే అసలు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఖాళీ అయ్యాయి..? తెలుగు రాష్ట్రాలకు కేటాయించే ఆ ఒక్క సీటు కోసం పోటీపడుతోన్న నేతలెవరో ఇప్పుడు చూద్దాం..




పశ్చిమ బెంగాల్‌లో 6, గుజరాత్‌లో 3, గోవాలో 1.. మొత్తం 10 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా ఇందులో 5 సీట్లలో బీజేపీకి బలం ఉంది. మరోవైపు బీజేపీ తరఫున తెలంగాణ నుంచి రేసులో వెదిరె శ్రీరామ్, గరికపాటి మోహన్‌రావు.. ఆంధ్రా నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ స్థానం అశిస్తున్నవారిలో ఉన్నారు. ఇంకా వీరితో పాటు బీజేపీ పరిశీలనలో బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో అనూహ్యంగా బ్యూరోక్రాట్స్‌కి సీటు కేటాయించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు విశ్లేషకులు.
ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో ఏపీ నుంచి ఒకరికి బెర్త్ ఖాయమనే మాట వినిపిస్తోంది. మెయిన్‌గా ముగ్గురు పేర్లు తెరపైకి వస్తున్నాయ్. సీఎం రమేష్, జీవీఎల్ నర్సింహరావులో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాపులకు పెద్దపీట వేయాలనుకుంటే మాత్రం సోము వీర్రాజుకి బెర్త్ దక్కొచ్చని అంటున్నారు. ఇక తెలంగాణ నుంచి రెడ్డి కులస్థుడైన వెదిరె శ్రీరామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..