AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: 20 కోట్ల కిలో మీటర్ల ప్రయాణం, భూమి చుట్టూ 4576 రౌండ్లు..! సునీతమ్మా.. నీకు వందనం!

సునీతా విలియమ్స్‌ మరియు బుచ్‌ విల్మోర్‌ 8 రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి, వ్యోమనౌక లోపం కారణంగా దాదాపు 9 నెలలు అక్కడే ఉండిపోయారు. స్పేస్ ఎక్స్ సహకారంతో నాసా వారిని భూమికి తీసుకువచ్చింది. సునీతా విలియమ్స్‌ తన మూడో అంతరిక్ష ప్రయాణంలో 286 రోజులు అంతరిక్షంలో గడిపి, రెండు స్పేస్‌వాక్‌లు చేసి, అనేక రికార్డులు సృష్టించారు. వారు 4,576 సార్లు భూమి చుట్టూ తిరిగారు.

Sunita Williams: 20 కోట్ల కిలో మీటర్ల ప్రయాణం, భూమి చుట్టూ 4576 రౌండ్లు..! సునీతమ్మా.. నీకు వందనం!
Sunita Williams
SN Pasha
|

Updated on: Mar 19, 2025 | 8:01 AM

Share

గతేడాది జూన్‌ 5న కేవలం 8 రోజుల మిషన్‌ కోసం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌.. వ్యోమనౌకలో చెడిపోవడంతో దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పేస్‌ ఎక్స్‌తో కలిసి నాసా ఈ రోజు(బుధవారం, మార్చ్‌ 19) ఉదయం వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చింది. యావత్‌ ప్రపంచం విలియమ్స్‌, విల్మోర్‌ రాకకోసం ఎంత ఉత్కంఠగా ఎదురుచూసింది. వారు సురక్షితంగా భూమిపై కాలు మోపారని తెలియడంతో అంతా సంతోషించారు. అయితే సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ గతంలో కూడా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

ప్రపంచ మొత్తం గర్వించదగ్గ ముద్దుబిడ్డ సునీతా విలియమ్స్‌ స్పేస్‌ ప్రయాణం, స్పేస్‌ వాక్‌లతో అనేక రికార్డులు నెలకొల్పారు. సునీతా, విల్మోర్‌ కలిసి రోదసీలో 286 రోజులు పరిశోధనలు చేపట్టారు. వీరిద్దరూ కలిసి 12 కోట్ల 13 లక్షల 47,491 మైళ్లు ప్రయాణించినట్లు నాసా తెలిపింది. అంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్లు. అలాగే వీరిద్దరూ భూమి చుట్టూ ఏకంగా 4,576 సార్లు తిరిగారు. ఈ మిషన్‌లో భాగంగా సునీతా రెండుసార్లు స్పేస్‌వాక్‌ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం‌ బయట 62 గంటల 6 నిమిషాలు స్పేస్‌వాక్‌ చేసి సునీతా అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఒక మహిళా వ్యోమగామి ఇన్ని గంటలు స్పేస్‌ వాక్‌ చేయడం మరో రికార్డు.

స్పేస్‌వాక్‌లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్‌ ఏంటెన్నా తొలగించారు. అంతేకాదు, స్పేస్‌ స్టేషన్‌ బయట ఉపరితలం నుంచి శాంపిల్స్‌ కూడా సేకరించారు. ఇప్పటి వరకు మూడు సార్లు స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన సునీతా విలియమ్స్‌.. మొత్తంగా 608 రోజుల పాటు స్పేస్‌లో ఉన్నారు. అంటే, ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి, శాస్త్రపరిశోధనల కోసం సునీతా విలియమ్స్‌ వెచ్చించిన ఈ సమయం ఎంతో మంది ప్రేరణాత్మకంగా నిలుస్తోంది. చాలా మంది ఆకాశంలో దేవతలు ఉంటారని అంటారు. కానీ, వాళ్లు నిజంగా ఉంటారా లేదో కానీ.. ఆకాశంలో నిజం ఉండి, నడిచిన దేవత మాత్రం మన సునీతా విలియమ్స్‌. ప్రాణాలను పణంగా పెట్టి, పరిశోధనల్లో భాగమై, భవిష్యత్తు తరాలకు బాటలు వేసిన సునీతమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!