Karimnagar Politics: ఒక్క సీటుపై మూడు పార్టీల కన్ను.. వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న నేతలు

అందరి దృష్టి కరీంనగర్ నియోజకవర్గంపైనే ఉంది. ఆ మూడు పార్టీలు పాగా వేసేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొదిస్తున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ బండి‌ సంజయ్ కుమార్‌కు మరోసారి భారతీయ జనతా పార్టీ టికెట్ ‌ఇచ్చింది. అదే విధంగా గత ఎన్నికలలో పోటీ చేసిన‌ వినోద్ కుమార్ బీఅర్ఎస్ టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ ‌మాత్రం‌ కుల సమీకరణాల అధారంగానే ఇక్కడ టికెట్ ఇచ్చేందుకు‌ కసరత్తులు కొనసాగిస్తోంది.

Karimnagar Politics: ఒక్క సీటుపై మూడు పార్టీల కన్ను.. వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్న నేతలు
Karimnagar
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Mar 10, 2024 | 12:49 PM

అందరి దృష్టి కరీంనగర్ నియోజకవర్గంపైనే ఉంది. ఆ మూడు పార్టీలు పాగా వేసేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొదిస్తున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ బండి‌ సంజయ్ కుమార్‌కు మరోసారి భారతీయ జనతా పార్టీ టికెట్ ‌ఇచ్చింది. అదే విధంగా గత ఎన్నికలలో పోటీ చేసిన‌ వినోద్ కుమార్ బీఅర్ఎస్ టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ ‌మాత్రం‌ కుల సమీకరణాల అధారంగానే ఇక్కడ టికెట్ ఇచ్చేందుకు‌ కసరత్తులు కొనసాగిస్తోంది.

కరీంనగర్ పార్లమెంటు ‌పరిధిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు‌ ప్రధాన పార్టీలు ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు‌ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే కాంగ్రెస్ ‌కూడా ఇద్దరు అభ్యర్థులకు ధీటుగానే బలమైనా అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని‌ రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పార్లమెంటు స్థానంలో రెండు‌ దశాబ్దాల నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకి అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే కుల సమీకరణాలలో సక్సెస్ అయినట్లు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. రెడ్డి ఓట్లు గెలుపు ఓటములలో కీలక ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే రెడ్డి‌ సంఘం తమ వారికి అవకాశం ‌కల్పించాలని తీర్మానం చేసింది. అధిష్టానం ‌ఇవ్వాలో రేపో ప్రవీణ్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ మాత్రం మోదీ సంక్షేమ పాలన, రామ మందిర అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇప్పటికే ప్రజాహిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు బండి‌ సంజయ్. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంటు మొత్తం పర్యటించే విధంగా ‌ప్లాన్ చేసుకున్నారు ‌సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ‌పైనా తనదైనా శైలిలో విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకు వచ్చిన నిధులను ప్రస్తావిస్తూ జనంలో దూసుకుపోతున్నారు. అధిక నిధులు తీసుకురావాలంటే తనలాంటి వ్యక్తులని గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారిగా కార్యకర్తల‌ సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‌కూడా వివిధ సమావేశాలలో పాల్గొంటున్నారు.

ఈ మూడు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. కరీంనగర్ పార్లమెంటులో పాగా వేయడం ఈ మూడు పార్టీలకి ఎంతో కీలకం‌. అంతే కాకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటుపైనా కూడ ప్రభావం ‌చూపుతోంది. ఇక్కడ వ్యూహత్మకంగా అడుగులు వేస్తే మరో రెండు పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామన్నా ధీమాతో ప్రధాన పార్టీలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…