Bigg Boss 4: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. బిగ్‌బాస్ సీజన్4 ఫేం అలేఖ్య హారికను వరించిన బంపర్ ఆఫర్..

Bigg Boss 4: యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం అలేఖ్య హారికను బంపర్ ఆఫర్ వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ..

Bigg Boss 4: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. బిగ్‌బాస్ సీజన్4 ఫేం అలేఖ్య హారికను వరించిన బంపర్ ఆఫర్..

Updated on: Mar 08, 2021 | 8:55 PM

Bigg Boss 4: యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం అలేఖ్య హారికను బంపర్ ఆఫర్ వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమించింది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో హారికకు బ్రాండ్ అంబాసిడర్ నియామక పత్రాన్ని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ అందజేశారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అలేఖ్య హారికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిచామని, రాష్ట్ర పర్యాటక రంగానికి ఆమె మరింత వన్నె తెస్తారని ఆకాంక్షించారు.

యూట్యూబ్‌లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన హారిక.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే హారిక బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టంట్‌లలో ఒకరుగా నిలిచింది. కాగా, హారికకు యూట్యూబ్‌లో 1.60 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇదిలాఉంటే.. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియామకం అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

Telangana State Tourism:

Here we go… https://t.co/pUDLjkR2sD

Also read:

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..

Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి… ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ

ప్రతిపక్షాలతో చెడుగుడు.. ఫన్ కోసం కబడ్డీ.. ఏ ఆటలోనైనా తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే రోజా.. హల్‌చల్ చేస్తోన్న వీడియో..