Big News Big Debate: వరదల్లో బురద రాజకీయమా..? తెలంగాణలో గరం గరం పాలిటిక్స్..
Big News Big Debate: వరద తగ్గింది.. బురదే మిగిలింది.. కాని రాజకీయం రంజుగా మారింది. తెలంగాణలో భారీ వర్షాలతో ఓవైపు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతుంటే.. ఈ వరద బురదల్లో లీడర్స్ పొలిటికల్ వార్‌కి దిగారు. ప్రభుత్వ అలసత్వం, అవినీతి వల్లే అపార నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రం ఇచ్చిన డిజాస్టర్ ఫండ్స్ ఏం చేశారని బీజేపీ ఫైర్ అవుతోంది.
Big News Big Debate: వరద తగ్గింది.. బురదే మిగిలింది.. కాని రాజకీయం రంజుగా మారింది. తెలంగాణలో భారీ వర్షాలతో ఓవైపు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతుంటే.. ఈ వరద బురదల్లో లీడర్స్ పొలిటికల్ వార్‌కి దిగారు. ప్రభుత్వ అలసత్వం, అవినీతి వల్లే అపార నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రం ఇచ్చిన డిజాస్టర్ ఫండ్స్ ఏం చేశారని బీజేపీ ఫైర్ అవుతోంది. మరి సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? వరద బాధితులకు ఎలాంటి సాయం ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో మూడు నాలుగు ఉమ్మడి జిల్లాలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి వరకు గోదారమ్మ పరీవాహక ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మోరంచపల్లి, కొండయి గ్రామాల దీనావస్థ తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించేసింది. భద్రాద్రి చుట్టుపక్కల మండలాల వరదలు.. ఖమ్మం మున్నేరు మహోగ్రరూపం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపించాయి. ప్రకృతి ప్రకోపం కొత్తేం కాదు.. కాని ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ అలసత్వం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 60మంది చనిపోయారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. చెరువుల మెయింటెనెన్స్ లేదని.. రాజకీయ అవసరాల కోసం, అవినీతికి కేరాఫ్‌లుగా చెక్ డ్యామ్స్ నిర్మాణం ఉందన్నారు భట్టి.
రాష్ట్ర వ్యాప్తంగా 40వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముందస్తు హెచ్చరికలున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు నేతలు. వరద బాధితులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 900 కోట్ల రూపాయలు డిజాస్టర్ ఫండ్స్ ఉన్నా.. ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు.
ఇక బీఆర్‌ఎస్ నేతలు కూడా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ ఐదేళ్లలో రెండుసార్లు వరదలు వస్తే.. మల్కాజ్‌గిరి ఎంపీ ఎక్కడకి పోయారంటూ పోస్టర్లు వెలిశాయి. ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్ల క్యాంపేన్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో వరదలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు.