Bear In Kamareddy: ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన మృగాలు జనావాసల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని రోజుల క్రితం చిరుత సంచారం ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ వరుసలోకి ఎలుగుబంటి వచ్చి చేరింది. శనివారం కామారెడ్డి జిల్లాల్లో ఓ ఎలుగుబంటి జనావాసల్లోకి వచ్చి హల్చల్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ శివారులో ఓ ఎలుగుబంటు ప్రవేశించింది. దీంతో గ్రామస్తులంతా ఎలుగును పట్టుకోవడానికి కర్రలు, వలలో ప్రయత్నించారు. ప్రజలంతా పెద్ద ఎత్తున గుమిగూడడంతో ఎలుగుబంటు స్థానికంగా ఉన్న పొలాల్లోకి పారిపోయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఎలుగుబంటును పట్టుకున్నారు. సుమారు 12 గంటలు శ్రమించిన తర్వాత ఎలుగుబంటును వంకాయ పల్లి గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్ వద్ద అధికారులు అందించారు. అనంతరం దానిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ జూ పార్కుకు తరలించారు.
Also Read: Narkuti Deepthi Microsoft: ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతం..