
మీరు సింగపూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధన గురించి తప్పక తెలుసుకోవాలి. ఇప్పటివరకు వీసా ఉండి.. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే విమానం ఎక్కేయొచ్చు, అక్కడ ల్యాండ్ అయ్యాక ఇమ్మిగ్రేషన్ చెకింగ్ ఉంటుంది అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సీన్ మారింది. మీరు విమానం ఎక్కకముందే అధికారులు మిమ్మల్ని ఆపేసే అవకాశం ఉంది.
సింగపూర్ ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్స్ అథారిటీ (ICA) సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేస్తూ నో బోర్డింగ్ డైరెక్టివ్ అనే కొత్త నిబంధనను 2026, జనవరి 30 నుంచి అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం సింగపూర్ వెళ్లే ప్రయాణికులను విమానం ఎక్కకముందే స్క్రీనింగ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే, వారికి బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా అక్కడికక్కడే నిలిపివేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు.
-సరైన వీసా లేకపోవడం లేదా వీసా గడువు ముగిసినా ప్రయాణించడం.
ఇవి కూడా చదవండి-ప్రయాణ సమయానికి పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల వాలిడిటీ లేకపోతే అనుమతించరు.
-గతంలో సింగపూర్ నిబంధనలు ఉల్లంఘించిన వారు లేదా బ్లాక్ లిస్ట్‌లో ఉన్నవారు.
-SG అరైవల్ కార్డ్ లో తప్పుడు వివరాలు నమోదు చేయడం.
ఈ నిబంధనలను ఎయిర్‌లైన్స్ సంస్థలు చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు నో బోర్డింగ్ చెప్పిన వ్యక్తిని విమానం ఎక్కనిస్తే.. ఆ ఎయిర్‌లైన్ సంస్థకు సుమారు 10,000 సింగపూర్ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 6.20 లక్షలు వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు, సంబంధిత పైలట్ లేదా సిబ్బందికి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బోర్డింగ్ వద్ద నిలిపివేయబడితే, వారు వెంటనే నేరుగా సింగపూర్ వెళ్లడానికి వీలుండదు. వారు ICA ఫీడ్‌బ్యాక్ ఛానల్ ద్వారా అధికారులను సంప్రదించి, ముందస్తు అనుమతి పొందిన తర్వాతే కొత్త టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది దాదాపు 10 లక్షల మందికి పైగా భారతీయులు సింగపూర్‌ను సందర్శించారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో సింగపూర్ ఒకటి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. విమానాశ్రయానికి వెళ్లే ముందే తమ వీసా, పాస్‌పోర్ట్ వాలిడిటీని మరోసారి సరిచూసుకోవడం ఉత్తమం.
ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..