Weather Forecast: అటెన్షన్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్.. 5 రోజులు కుండపోత వర్షమే..!

|

Jul 21, 2023 | 7:47 AM

అటెన్షన్‌ ఎవ్రీబడీ.. తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, కాదుకాదు డేంజర్‌ వార్నింగ్‌ ఇది. ఇది మేం చెబుతున్నది కాదు.. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రకటన. మీరు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల్లో పడటం ఖాయం అని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులకు డేంజర్‌ వార్నింగ్‌ ఇది. శుక్రవారం, శనివారం.. మరీ అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, లేదంటే ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టొద్దని సూచిస్తున్నారు అధికారులు.

Weather Forecast: అటెన్షన్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్.. 5 రోజులు కుండపోత వర్షమే..!
Rains
Follow us on

అటెన్షన్‌ ఎవ్రీబడీ.. తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, కాదుకాదు డేంజర్‌ వార్నింగ్‌ ఇది. ఇది మేం చెబుతున్నది కాదు.. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రకటన. మీరు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందుల్లో పడటం ఖాయం అని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులకు డేంజర్‌ వార్నింగ్‌ ఇది. శుక్రవారం, శనివారం.. మరీ అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, లేదంటే ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టొద్దని సూచిస్తున్నారు అధికారులు. కారణం.. నేటి నుంచి మరో నాలుగైదు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఇప్పటివరకు చూసింది ట్రైలరే అని, అసలు సినిమా ఇవాళ్టి నుంచే ఉంటుందంటోంది ఐఎండీ. ఈరోజు నుంచి మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది

ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా నాన్‌స్టాప్‌గా జోరువాన దంచికొడుతోంది. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ అల్పపీడనం కారణంగానే ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే.. వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 5 రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. ముఖ్యంగా, ఉత్తర, దక్షిణ తెలంగాణకి వార్నింగ్‌ ఇచ్చింది. ఇక వాతావరణ శాఖ వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో క్షణక్షణం పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

సెలవులు..

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో శుక్రవారం, శనివారాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆఫీసులకు కూడా రెండ్రోజుల సెలవు ప్రకటించింది. ప్రైవేట్‌ సంస్థలు కూడా సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో హైదరాబాద్‌లో సగటున 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ.. హైదరాబాదీలకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్ 9000113667 ను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగైదు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ఏపీ వాసుల్ని హడలెత్తిస్తున్నాయ్‌. ఆంధ్రాలో మరో 5రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో గంటకు 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పరిస్థితి భయానకంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుందని చెబుతున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కమ్యూనికేషన్‌ కట్‌ అయ్యింది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. ప్రజల కోసం ప్రభుత్వం హెల్ప్‌ లైన్ – 1070, 18004250101 ను ప్రకటించింది. ఇక గోదావరి నదికి వరద నీరు పెరిగింది. పోలవరం, ధవళేశ్వరం దగ్గర 5లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.


మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..