ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంతోషమొచ్చినా, కోపమొచ్చినా అసలు తట్టుకోలేడు. ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. తన ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే బండ్లన్న మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు బండ్ల గణేశ్. సతీమణితో కలిసి ఈ దేవాలయానికి వెళ్లిన అక్కడి శిల్పకళా సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అదే సందర్భంలో ఈ ఆలయాన్ని అద్భుతంగా పునఃర్మించిన సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.’ఎన్నో రోజుల నుంచి శ్రీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావడం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ ప్రత్యక్ష నిదర్శనం. కేసీఆర్ గారి ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానం గానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను, చాలా సంతోషం అనిపించింది’
‘ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను. మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నానని అన్నారు. ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక, మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పది. భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడిందని అది తనకు ఆనందాన్నిస్తుంది. నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని, మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఏ స్వార్ధం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు, నా మనసులోని మాటలు చెప్తున్నానని పేర్కొన్న ఆయన మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను, అది నా నైజం సార్, మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు’ అని వరుస ట్వీట్లు చేశారు బండ్ల గణేశ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి శ్రీ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు. @TelanganaCMO pic.twitter.com/vvJBcsxZpg
— BANDLA GANESH. (@ganeshbandla) February 14, 2023
మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పదం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక..@TelanganaCMO pic.twitter.com/cSpuqxRQxY
— BANDLA GANESH. (@ganeshbandla) February 14, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..