Bandi Sanjay: అది బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తా.. లేకుంటే కేసీఆర్‌ చేస్తారా..? బండి సంజయ్‌ సవాల్

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వార్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి..

Bandi Sanjay: అది బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తా.. లేకుంటే కేసీఆర్‌ చేస్తారా..? బండి సంజయ్‌ సవాల్
Bandi Sanjay
Follow us

|

Updated on: Sep 12, 2022 | 4:40 PM

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వార్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే కేంద్రంపై మండిపడుతున్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో బీజేపీ బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడారు. నిధులు వినియోగం, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధుల అంశాలపై కేసీఆర్‌ వివిధ సందర్బాలలో ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం చేసిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తానని, మోటారుకు మీటర్‌ పెట్టాలని బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేదంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్ఆర్‌ఆర్‌ను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని, మరో ఆర్‌ కలవబోతున్నారని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ను న్యూయార్క్‌, సింగపూర్‌ చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్‌ చేశారు. చిన్న పాటి వర్షం పడితే హైదరాబాద్‌ నగరం దారుణంగా మారుతుందని, నగరంలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్న కేసీఆర్‌కు సీటిలోని గుంతలు చూపిస్తే రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇస్తానని, ఇప్పటి వరకు ఇవ్వలేదని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని కేసీఆర్‌పై సంజయ్‌ ధ్వజమెత్తారు. రాష్టర్ సమస్యలను గాలికి వదిలేసి దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నారని, కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కాదు.. పీఆర్‌ఎస్‌ పెట్టుకుని కేఏ పాల్‌తో కలిసి తిరిగినా ఒరిగేదేమి లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త