Rahul Bharat Jodo Yatra: ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కర్‌పై కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద ట్వీట్.. ఇంకా 145 రోజులు ఉన్నాయంటూ కామెంట్..
Congress Targeted RSS: రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్ట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ డ్రెస్‌కు నిప్పు పెట్టినట్లుగా..
కాంగ్రెస్ తన భారత్ జోడో యాత్ర కొనసాగుతుండగా వివాదాస్పద ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్ట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ డ్రెస్‌కు నిప్పు పెట్టినట్లుగా.. దాని నుంచి పొగ వస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ చిత్రం ద్వారా, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్-బిజెపిని లక్ష్యంగా చేసుకుంది. ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ నుంచి కూడా విముక్తి పొందేందుకు, ఒక్కొక్క అడుగు వేసి లక్ష్యాన్నిచేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్‌లో పేర్కొన్నది. ఖాకీ నిక్కర్ కాలుతున్న ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఆ పార్టీ. ఇంకా 145 రోజులు ఉన్నాయంటూ ఆ ఫోటోకు క్యాప్షన్‌ను జోడించింది.
అయితే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌లో భారత్ జోడోయాత్ర హ్యాష్‌టాగ్ కూడా పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
Step by step, we will reach our goal.#BharatJodoYatra ?? pic.twitter.com/MuoDZuCHJ2
— Congress (@INCIndia) September 12, 2022
గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఖాకీ కలర్ నిక్కర్ వేసుకునే విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్(గతంలో) నిప్పు అంటుకున్నట్లు పెట్టిన ఫోటోపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తోంది భారత్ జోడో యాత్ర కాదు.. అది భారత్ తోడో యాత్ర అంటూ మండిపడుతున్నారు. తక్షణమే ఆ ఫోటో ట్వీట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం