Video Viral: ఈ ప్రమాదాన్ని చూస్తే భయంతో వణికిపోవాల్సిందే.. కారును ఢీకొట్టి.. రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

ప్రమాదాలు మనకు చెప్పి రావు. ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎలా వస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా..

Video Viral: ఈ ప్రమాదాన్ని చూస్తే భయంతో వణికిపోవాల్సిందే.. కారును ఢీకొట్టి.. రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
Pune Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 12, 2022 | 1:07 PM

ప్రమాదాలు మనకు చెప్పి రావు. ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎలా వస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీటి కారణంగా చనిపోతున్న వారు, గాయపడుతున్న వారి సంఖ్య ఊహించనంతగా ఉంది. ఎన్నో కుటుంబాలు యాక్సిడెంట్ ప్రభావానికి లోనై మగ్గిపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తూంటే ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కార్లు, బైక్ లు, వ్యాన్ లు, బస్సులు, లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని సార్లు నడుచుకుంటూ వెళ్లినా ప్రమాదం ముంచుకొస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు భయంతో పాటు బాధ్యతను తెలియజేస్తాయి. రోడ్డు భద్రత నియమాలు ఎందుకు పాటించాలనే విషయాన్ని తెలుపుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పుణె – అహ్మద్‌నగర్‌ హైవేపై శిక్రాపూర్‌ సమీపంలో జరిగిన ప్రమాదం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. హైవే పై ఓ కంటైనర్‌ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న కారును ఢీకొంటింది. అంతటితో ఆగకుండా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అదృష్టవశాత్తూ.. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కారును ట్రక్కు ఈడ్చుకెళ్లే సమయంలో రోడ్డుపై నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఘటనను నేరుగా చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.