AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Scam: విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు.. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనకను విచారించిన ఈడీ..

Menaka Gambhir Coal Scam:తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనక గంభీర్‌ కోల్‌కతాలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆమెకు సమన్లు

Coal Scam: విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు.. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనకను విచారించిన ఈడీ..
Menaka Gambhir Coal Scam
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2022 | 1:54 PM

Share

బెంగాల్‌ కోల్ స్కాంలో తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనక గంభీర్‌ కోల్‌కతాలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బదులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరు కావాలని గంభీర్‌కు ఈడీ ‘తప్పు’ నోటీసు జారీ చేసింది. ఇందులో పీఎం బదులగా ఏఏం అంటూ నోటీసులుపంపించింది. ఇందులో విదేశాలకు నిధులను అక్రమంగా తరలించారని మేనక గంభీర్‌పై ఆరోపణలు వచ్చాయి. కోల్‌స్కాంలో అభిషేక్‌ బెనర్జీతో పాటు ఆయన భార్యను ఇప్పటికే ఈడీ విచారించింది. మేనక గంభీర్‌ రెండు రోజుల క్రితం బ్యాంకాంక్‌ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. కోల్‌స్కాంలో ఈడీ ఆమెపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతించలేదు. అయితే కావాలనే తన కుటుంబ సభ్యులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

మేనకా గంభీర్ విదేశాలకు..

మేనకా గంభీర్‌కు కోల్‌కతా విమానాశ్రయంలో ఈడీ అధికారులు సెప్టెంబర్ 10న ఆదివారం ‘అర్ధరాత్రి’ ఏజెన్సీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు అందజేశారు. ఆరోపించిన బొగ్గు కుంభకోణం కేసులో తనను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆమెను విదేశీ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. సమన్లలో ఇచ్చిన సమయం ప్రకారం గంభీర్ సాల్ట్ లేక్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారని.. ఆ సమయంలో కార్యాలయంల మూసి ఉందన్నారు.

PM- AM లో పొరపాటు

ఆ సమయంలోనే ఈడీ అధికారులను సంప్రదించి ఉండాల్సింది లేదా వారి రాక గురించి సమాచారం పంపి ఉండాల్సిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇందులో పొరపాటు జరిగిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇది టైపోగ్రాఫికల్ పొరపాటు అని వెల్లడించింది. దీనిలో PMకి బదులుగా AM అని అచ్చు అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని మేనకా గంభీర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ కోరింది.

 మరిన్ని జాతీయ వార్తల కోసం