Bandi Sanjay: రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే.. భవిష్యత్‌లో దేవుడ్ని నమ్మేలా చూడాలని..
టాలివుడ్ డైరెక్టర్ రాజమౌళిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. వారణాసి గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ఆంజనేయుడు లేడన్న రాజమౌళి.. ఆయన దేవుడ్ని నమ్మేలా చూడాలని దేవుడ్ని కోరుకుంటున్నానంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

మహేష్‌బాబు వారణాసి మూవీ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ఆంజనేయుడు లేడన్న రాజమౌళి మాటలపై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. భవిష్యత్‌లో రాజమౌళి దేవుడ్ని నమ్మేలా చూడాలని ఆంజనేయుడ్ని కోరుకుంటున్నానని అన్నారాయన. ఆంజనేయుడు, అమ్మవారి ఆశీర్వాదంతో రాజమౌళి నిండునూరేళ్లు బతకాలని, మరిన్ని సక్సెస్‌లు సాధించాలన్నారు బండి సంజయ్. అలాగే రాజమౌళి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు బీజేపీ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహా ఇంచార్జీ పొంగులేటి సుధాకరరెడ్డి కూడా రాజమౌళి వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు దురదృష్టకరం, అసందర్భం. రాజమౌళి తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారాయన. కోట్లాది మంది భక్తులు మనోభవాలను రాజమౌళి దెబ్బ తీశారు. భావస్వేచ్చ ఉందని మనోభావాలను రెచ్చగొట్టే హక్కు ఎవరికీ లేదు. ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదని ఆయన పేర్కొన్నారు.
