Bandi Sanjay: టీడీపీ – బీజేపీ పొత్తులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. అయితే పొత్తుల గురించి చర్చించేందుకే చంద్రబాబు అక్కడికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Bandi Sanjay: టీడీపీ - బీజేపీ పొత్తులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Bandi Sanjay

Updated on: Jun 04, 2023 | 5:12 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. అయితే పొత్తుల గురించి చర్చించేందుకే చంద్రబాబు అక్కడికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనేది ఊహగానాలే అని తేల్చి చెప్పారు. ఊహజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలను.. చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

గతంలో మమత బెనర్జీ, నితిశ్ కుమార్, స్టాలిన్‌లు కూడా మోదీ, అమిత్ షా ను కలిసినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మాదిరిగా ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదన్నారు. మరోవైపు మహజన్ సంపర్క్ అభియన్ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని పిలపునిచ్చారు.