
Bandi Sanjay Padayatra: బైంసా, కరీంనగర్‌లో నిన్నటి నుంచి టెన్షన్ టెన్షన్ నెలకొంది. నిర్మల్ జిల్లా బైంసాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చివరి నిమిషంలో బండి సంజయ్ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. అనంతరం అర్థరాత్రి నుంచే బీజేపీ నేతల అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. నిర్మల్ జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తల హౌస్‌అరెస్ట్‌లతో టెన్షన్ టెన్షన్ నెలకొంది. దీంతోపాటు.. బండి సంజయ్ స్వగృహం కరీంనగర్లో కూడా ఆందోళన నెలకొంది.
కాగా, భైంసాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అయితే, యాత్ర జరిగి తీరుతుందందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. పాదయాత్రపై హైకోర్టుకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఇవాళ భైంసాలో బహిరంగ సభపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే.. తదుపరి కార్యచరణను ప్రకటించనున్నారు.
సభకు అన్ని అనుమతులు ఇచ్చాక.. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా.. సున్నితమైన ప్రాంతంలో భద్రత ఇవ్వలేమంటూ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ప్రజాసంగ్రమ యాత్రతోపాటు.. బహిరంగ సభకు కూడా అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Is Bainsa restricted area ? Why can’t we go there?
How will CM who can’t let us conduct a meeting peacefully, protect state? Police stopped me & made me return to Karimnagar & reason is response to #PrajaSangramaYatra5
This is evidence of KCR’s dictatorial rule. We’ll go to court pic.twitter.com/6HQTtYCGMU— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 27, 2022
పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్న ఈ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.. రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. బైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దంటూ ప్రశ్నించారు. బైంసానే కాపాడలేని CM రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు.? CMకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలంటూ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..