ప్రధాని కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఆటంకం అని విమర్శించారు బండి సంజయ్. కేసీఆర్ కోసం ప్రోటోకాల్ ప్రకారం చెయిర్ కూడా వేశామని ఆయన అన్నారు. సన్మానించేందుకు శాలువ కూడా పట్టుకొచ్చామన్నారు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ ఎందుకు రాలేదని, సీఎం షెడ్యూల్‌ను బయట పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంకావడానికి దేశ ప్రధాని, రైల్వే మినిస్టర్‌తో బీజేపీ పార్టీ నాయకులంతా హాజరయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదని చెప్పుకొచ్చారు. దీనికి జ్వరం వచ్చిందని అంటారా.? కోవిడ్ వచ్చిందని అంటారా? అంటూ ఎద్దేవ చేశారు. కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏంటో తెలంగాణ ప్రజానికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సీఎం రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని, ప్రధాని తిడుతూ మళ్లీ సెంటిమెంట్ రగిలించే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..