AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Environment Wok Shop: ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి.. భూమిని కాపాడుకొందాం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపు

పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఒకరోజు వర్క్ షాప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు సచివాలయంలోని వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Environment Wok Shop: ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి.. భూమిని కాపాడుకొందాం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపు
Cs Shanti Kumari
Balaraju Goud
|

Updated on: Oct 21, 2023 | 5:24 PM

Share

పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఒకరోజు వర్క్ షాప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు సచివాలయంలోని వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్నిఅలవాటు చేసుకోవాలని సూచించారు సీఎస్ శాంతి కుమారి. ప్లాస్టిక్ నిషేధం పై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని కార్యదర్శులకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ-సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టీక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే, రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, ప్రతీ గ్రామంలో చెత్త నుండి ప్లాస్టిక్ వ్యర్దాలను వేరు చేస్తున్నామని వివరించారు.

సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయంలో స్వచ్ఛందంగా నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శుల నుండి, ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ప్రధానంగా, వాటర్ బాటిళ్లు, కవర్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్ట్రాలలో ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారని, వీటి స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువులు వాడాలని కోరారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని అన్నారు. ఇక రాష్ట్రాన్ని సింగిల్ యూస్ ప్లాస్టీక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యక్తిగంతగా కృషి చేయాలని కాలుష్య నివారణ మండలి చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పిలుపునిచ్చారు. ప్లాటిక్ నిషేధంపై ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీలున్నాయని, ప్రజా చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని తెలిపారు.

ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వినియోగించే ప్రత్యామ్నాయ వస్తువులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను సి.ఎస్ శాంతి కుమారి ప్రారంభించగా, ఈ వర్క్ షాప్ కు హాజరైన కార్యదర్శులు, ఉన్నతాధికారులు సందర్శించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ ను ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఆవిష్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…