Telangana: స్నానం చేస్తుంగా నీళ్లు మింగిన చిన్నారి.. ఆగిన శ్వాస.. సీపీఆర్ చేయడంతో
పాప నీళ్లు ఒక్కసారిగా మింగింది. దీంతో శ్వాస ఆగిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆశా కార్యకర్తలు వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు 108 సిబ్బంది… ఓ చిన్నారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. స్నానం చేయిస్తుండగా చిన్నారి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది. చిన్నారి పరిస్థితి విషమిస్తుండడంతో ఆశా కార్యకర్తులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే రెస్పాండ్ అయిన 108 సిబ్బంది.. సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
చూశారుగా సీపీఆర్ ఓ ప్రాణాన్ని ఎలా నిలబెట్టిందో. ఇలాంటి సందర్భాల్లో మనం ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యాం అనే అంశం ముఖ్యం. అందుకే అందరూ సీపీఆర్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి. దానిపై పూర్తిగా అవగాహన పెంచుకోండి. ప్రజంట్ గుండెపోట్ల కాలం నడుస్తుంది. అప్పటివరకు బానే ఉన్నవారు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోతున్నారు. వెంటనే స్పందించి.. సీపీఆర్ చేస్తే.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..