Big News Big Debate: తెలంగాణలో హైటెన్షన్.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారిన పేపర్ లీక్ వ్యవహారం..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ప్రతిష్టాత్మకంగా భావించే టెన్త్, ఇంటర్, ఎంసెట్ పత్రాలు బయటకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్త్ పేపర్ లీక్ తెలుగురాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద సంచలనం..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ప్రతిష్టాత్మకంగా భావించే టెన్త్, ఇంటర్, ఎంసెట్ పత్రాలు బయటకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్త్ పేపర్ లీక్ తెలుగురాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద సంచలనం.. ఈ మాటకొస్తే ఓ హిస్టరీగా మారబోతుంది. ఈ కేసులో A-1గా ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉండటంతో రాజకీయంగా ఇది అతిపెద్ద చర్చకు తెరతీసింది. దేశ చరిత్రలోనే ఇలాంటి కేసు మొదటికి కావొచ్చు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. జడ్జి ముందు హాజరుపరిచారు.BRS- BJP మధ్య పచ్చగడ్డి కూడా వేయకుండానే భగ్గుమనే సిట్యుయేషన్. ఇప్పుడు దానికి ఈ లీకేజీ రచ్చ కూడా తోడైంది. రెండు పార్టీల మధ్య ఓ యుద్ధమే నడుస్తోంది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమం అంటోంది కమలదళం. TSPSC నుంచి మొదలు పడితే.. మొన్న తాండూరు.. నిన్నటి కమలపూర్ టెన్త్ పేపర్ల లీకేజీ వెనుక BJP కుట్ర ఉందని ఆరోపిస్తోంది గులాబీదళం. పరస్పరం సవాళ్లతో మ్యాటర్ ఫుల్‌గా హీటెక్కించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..