Ask KTR : కేంద్రం అనాలోచిత నిర్ణయాలే కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యానికి కారణం.. ‘ఆస్క్ కేటీఆర్‌’‌లో వ్యాఖ్య

|

Jun 07, 2021 | 12:00 AM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడానికి కారణమని తెలంగాణ ఐటీ..

Ask KTR :  కేంద్రం అనాలోచిత నిర్ణయాలే కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యానికి కారణం.. ఆస్క్ కేటీఆర్‌‌లో వ్యాఖ్య
KTR
Follow us on

KTR on covid vaccination : డిమాండుకు తగ్గ సప్లై లేకపోవడం, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడానికి కారణమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీకా తయారీలో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్న భారత్‌లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడడమేంటని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తుండడం చూసి ప్రపంచదేశాలు గత ఏడాది మే నెలలోనే వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు పెట్టాయని తెలిపారు. కానీ, భారత్‌ మాత్రం జనవరి వరకు తాత్సారం చేసిందని ఆయన ఆరోపించారు. ట్విటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించే ‘ఆస్క్‌ కేటీఆర్‌’కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు ‘లెట్స్‌ టాక్ వ్యాక్సినేషన్‌’ అనే అంశంతో చర్చను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అనేక రకాల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి తెలంగాణలో వ్యాక్సిన్‌ వేస్తామన్న కేటీఆర్.. పిల్లల వ్యాక్సిన్లకు ఇంకా ఆమోదం రాలేదు. పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని అన్నారు. వీలైనంత వేగంగా అందరికీ వ్యాక్సిన్‌ వేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లకు ఎటువంటి స్పందన రాలేదని కేటీఆర్ చెప్పారు.

Read also : Sharmila : ‘సారూ.. ! చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ : షర్మిల