న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు మహిళను లోబర్చుకున్నాడు. అవసరానికి వాడుకున్నాడు. తీరా విషయం పెద్దాఫీసర్లకు తెలిసి ఇలా బుక్కైయ్యాడు. మహిళా ఫిర్యాదురాలితో అనైతిక సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్‌లో వి.రామయ్య అనే ఎఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం ఏర్పడింది. బాధితురాలికి తగిన న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని తరుచు కాల్ చేస్తూ ముగ్గులోకి దింపాడు.
ఆమెతో ఎఎస్ఐ రామయ్య వివాహేతర సంబంధం కొనసాగించారు. అంతేకాదు ఏకంగా తానూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకుని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపి అధికారులకు దొరికిపోయాడు. ఈ ఎఎస్ఐ రాసలీల భాగవతం స్థానిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగంతో సదరు ఎఎస్ఐ భాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో విచారణ జరిపిన పోలీస్ అధికారులు ఎఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…