KCR TOUR: పార్లమెంట్ ఎన్నికల వేళ సరికొత్త వ్యూహాలతో జనంలోకి కేసీఆర్.. రూట్‌మ్యాప్ సిద్ధం!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ సరికొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దిగుతుంది బీఆర్ఎస్. ఏప్రిల్ ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ బాష్ కేసీఆర్ క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. ఇటీవల కాలంలో సాగు నీరు అందక పోలాలు ఎండిపోయాని రైతు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దెబ్బతిన్న పొలాలను సందర్శించారు. ఇప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు నేరుగా కేసీఆరే రంగంలోకి దిగేలా ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. ఏప్రిల్ మొదటి వారం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎండిపోయి పంటపోలాలను, రైతులను పరామర్శించే ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్.
ఏప్రిల్ మొదటి వారంలో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేయన్నారు కేసీఆర్. నల్గొండ, భువనగిరి, ఆలేరులో పర్యటించి.. పంటనష్టం వివరాలు స్వయంగా తెలుసుకోనున్నారు కేసీఆర్. పంట పొలాల పరిశీలనకు సంబంధించిన కేసీఆర్ రూట్‌మ్యాప్ ను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సిద్ధం చేస్తున్నారు. పంట పొలాల పరిశీలనతో పాటు రైతుల్లో భరోసా నింపేలా కేసీఆర్ టూర్ ప్లా్న్ చేస్తుంది బీఆర్ఎస్. ఈమేరకు రెండు మూడు రోజుల్లో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ నిర్ణయం సర్వత్ర చర్చకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే నల్లగొండలోని సాగర్ డామ్ లో నీరు డెడ్ స్టోరేజీకి చేరడంతో పరివాహక ప్రాంత రైతులకు నీరు అందడం లేదు. దీంతో సాగర్ అయకట్టపై ఆధారపడిన రైతుల పొలాలు ఇప్పటికే ఎండిపోగా.. బోర్లు, బావుల్లో నీరు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…