Medaram: చీపురు పట్టిన సీతక్క.. స్వచ్ఛ మేడారమే లక్ష్యంగా..
మొదట కొండాయి గ్రామానికి చేరుకొని గోవిందరాజుల దేవాలయాన్ని, నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు.. వాటి అభివృద్ది పై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. మేడారం పూజారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర శాఖల అధికారులతో కలిసి ఈ ప్రాంతమంతా పరిశీలించి..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో చీపురుపట్టారు. స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లన్నీ శుభ్రంచేశారు.. జాతరకొచ్చే ప్రతి ఒక్కరు మన మేడారం పరిసరాలను శుభ్రంగా ఉంచాలని.. స్వచ్ఛ మేడారం గా రూపుదిద్ది.. వనదేవతలు కొలువైన మేడారం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క మేడారంలో పర్యటించారు. జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన సీతక్క మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
మొదట కొండాయి గ్రామానికి చేరుకొని గోవిందరాజుల దేవాలయాన్ని, నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు.. వాటి అభివృద్ది పై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. మేడారం పూజారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర శాఖల అధికారులతో కలిసి ఈ ప్రాంతమంతా పరిశీలించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జంపనవాగుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆమె పరిశీలించారు.
అనంతరం మేడారం గద్దెల ప్రాంతానికి చేరుకొని ముక్కలు చెల్లించుకున్నారు.. ఆ తర్వాత స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఎవరు ఇక్కడ ప్లాస్టిక్ ఉపయోగించవద్దని భక్తులకు, అధికార యంత్రంగానికి, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. జాతరలో ప్లాస్టిక్ వినియోగంకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చీపురు పట్టిరోడ్లు ఊడ్చారు.. పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లన్నీ శుభ్రం చేసి వారిలో ప్రోత్సాహం నింపారు. మేడారంకు వచ్చే భక్తులతో పాటు ఇక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు మేడారం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.. ప్లాస్టిక్ అమ్మినా.. వినియోగించినా కఠిన చర్యలు తప్పక హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..