
తెలంగాణలో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నెల రోజుల వ్యవధిలోనే ఎంతోమంది ప్రభుత్వ అవినీతి అధికారులను కటకటాలకు నెట్టారు. తాజాగా హైదరాబాద్ రేంజ్ అధికారులు మాజీ ఏఈఈ నికేష్ కుమార్‌ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆదాయనికి మించిన ఆస్తులు కూడ పెట్టుకున్నారని ఆరోపణలతో నికేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు గత నెల 30న దాడి నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో దాదాపు 17.5 కోట్లకు పైగా అక్రమస్తులను గుర్తించారు.
అయితే అతనిపై గతంలోనే అవినీతి ఆరోపణలు రావటంతో ఏసీబీ అధికారులు ఒకసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు నికేష్ కుమార్. అయితే ఎలాగైనా సరే ఏసీబీ అధికారులు తన మీద దృష్టి సారిస్తారని ముందే గ్రహించిన నికేష్ కుమార్ తనకు చెందిన బంగారం మొత్తాన్ని తన స్నేహితుడు ఇంట్లో దాచాడు. ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలోనూ ఇంట్లో ఎలాంటి నగదు కానీ బంగారం కానీ లభించలేదు. దీంతో అవాక్కైన ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ సెల్‌ఫోన్ కాంటాక్ట్స్ పరిశీలించారు. అందులో పదేపదే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ స్నేహితుడు బ్యాంకు లాకర్‌ను కనుగొన్న ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు.
నికేష్ కుమార్ లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులకు కళ్ళు చెదిరే వాస్తవాలను బయటపడ్డాయి. దాదాపు రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు అందులో లభ్యమయ్యాయి. నికేష్ కుమార్ స్నేహితుడిని ఈ బంగారం గురించి ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదు అనే సమాధానం ఇచ్చాడు. దీంతో మరోసారి నికేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు జరిపిన తరుణంలో 8 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిలో రెండు మాత్రం నికేష్‌కు చెందిన లాకర్లుగా గుర్తించారు. మిగిలిన ఆరు లాకర్లలో తన స్నేహితులు బంధువుల పేర్ల మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కోర్టు కష్టడికి అనుమతించిన తర్వాత నికేష్ లాకర్లను సైతం అధికారులు తెరవమన్నారు.
Nikesh Kumar
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..