Telangana: సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం.. 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప..
హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ రావు, వేద రజిని, పిట్టల రవీందర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, భరత్ కుమార్, పల్లె రవికుమార్, నంది కంటి శ్రీధర్, రవీందర్ సింగ్, ఆయాచితం శ్రీధర్, ప్రొఫెసర్ కే లింబాద్రి.. తదితర మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు రద్దయ్యాయి.
డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ శనివారం (డిసెంబర్ 9) ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే.