AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్త..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్త..
Rains
Venkatrao Lella
|

Updated on: Sep 24, 2026 | 4:45 PM

Share

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నిన్నటి తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 23 రాత్రి 11 గంటల నుండి సెప్టెంబర్ 24 (ఈ రోజు) తెల్లవారుజామున 0100 గంట మధ్య కాలంలో కళింగపట్నం నైరుతి దిశ లో తీరాన్ని దాటింది. ఈ తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలి, ఈ రోజు, సెప్టెంబర్ 24, 2026 ఉదయం 0830 గంటలకు (భారత కాలమానము ప్రకారము ) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశాపై 18.5° ఉత్తర అక్షాంశం, 83.5° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు పశ్చిమ-వాయువ్యంగా 70 కిలోమీటర్లు, రాయగడ (ఒడిశా)కు దక్షిణ-ఆగ్నేయంగా 80 కిలోమీటర్లు, కోరాపుట్ (ఒడిశా)కు తూర్పు-ఆగ్నేయంగా 90 కిలోమీటర్లు, జగదల్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు తూర్పు-ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తదుపరి ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనించి, ఈ రోజు (సెప్టెంబర్ 24) సాయంత్రం సమయానికి వాయుగుండముగా క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఇది ఉత్తర-వాయువ్య దిశగానే పయనిస్తూ, తదుపరి 24 గంటల్లో మరింతగా బలహీనపడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా తీవ్ర వాయుగుండము కేంద్రం నుండి థాయ్‌లాండ్ గల్ఫ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉన్న నిన్నటి ద్రోణి ఈ రోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను ఐఎండీ జారీ చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 50-60 గరిష్టముగా 70 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరించింది.

తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర, మధ్య జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలోని ఒకటి రెండు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఈరోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 45 నుండి 55 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
మూత్రపిండాల సమస్య ముందే తెలిసిపోతుందా? ఈ నొప్పితో జాగ్రత్త
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
అనంత చతుర్దశి.. సెప్టెంబర్ 25నే.. గణేష్ విసర్జన్, అనంత వ్రతం, పూజ
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
ఈ నెల 30 వరకే ఛాన్స్.. ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్..
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!