Telangana Congress: కాంగ్రెస్‌లో మరో పంచాయితీ రెడీ.. రేవంత్‌పై సీనియర్లు గుస్సా.. కారణమిదేనట..

|

Nov 26, 2022 | 1:16 PM

రాజకీయ పార్టీలందు కాంగ్రెస్ పార్టీ తీరే వేరయా.. అవును మరి. ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసం పోరాటం సాగిస్తాయి. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా పక్కనపెట్టి కలిసి..

Telangana Congress: కాంగ్రెస్‌లో మరో పంచాయితీ రెడీ.. రేవంత్‌పై సీనియర్లు గుస్సా.. కారణమిదేనట..
Telangana Congress
Follow us on

రాజకీయ పార్టీలందు కాంగ్రెస్ పార్టీ తీరే వేరయా.. అవును మరి. ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసం పోరాటం సాగిస్తాయి. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా పక్కనపెట్టి కలిసి పోరాటం సాగిస్తారు నాయకులు. కానీ, కాంగ్రెస్ పార్టీ తీరే వేరు. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరు మరింత వేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా అంతర్గత కొట్లాటలతోనే సతమతం అవుతోంది ఆ పార్టీ. ఓవైపు మరో ప్రత్యర్థి పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం అదేమీ పట్టనట్లుగా కొట్లాటలతోనే మునిగిపోతుంది. ఒక్క మాటలతో చెప్పాలంటే రాజకీయంగా ఆత్మహత్యాయత్నం చేస్తుందనే చెప్పాలి. అవును మరి.. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది ఆ పార్టీ.

కాంగ్రెస్‌లో విబేధాలు, వివాదాలు కొత్తేమీ కాదు. ఒక పంచాయితీ ముగిసేలోపు మరొకటి రెడీగా ఉంటుంది. ఓవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దడం, పార్టీకి బూస్టప్‌ ఇవ్వడం.. రేవంత్‌కు కొత్త టీమ్‌పై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇదే టైమ్‌లో సీనియర్లు తమ వాయిస్‌ను మరోసారి కాస్త గట్టిగానే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌కు కొత్త టీమ్‌ కోసం అధిష్ఠానం చేస్తున్న కసరత్తుపై అలకబూనుతున్నారు.

రేవంత్ ప్రతిసారి తమనే బదనాం చేస్తున్నారన్నది సీనియర్ల వర్షన్. కొత్త టీమ్‌ను నియమిస్తే ఓట్లు పడుతాయా? పార్టీలో పరిస్థితుల రివ్యూ చేయరా? మునుగోడు ఓటమి తర్వాత ఇంత వరకు ఒక్క సమీక్షా సమావేశం కూడా ఎందుకు పెట్టలేదు.? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దీనిపై ఇటు రేవంత్, అటు అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..