
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
పటాన్‌చెరులో 8.2, ఆదిలాబాద్‌లో 9.2, రాజేంద్రనగర్‌లో 10, భద్రాచలంలో 15, దుండిగల్‌లో 13.9, హనుమకొండలో 12 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 13.7, ఖమ్మంలో 15, మహబూబ్‌నగర్‌లో 17, మెదక్‌లో 10.2, నల్గొండలో 13.4, నిజామాబాద్‌లో 13.6, రామగుండంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీల్లో సాయంత్రం నాలుగైదు గంటలకే చల్ల గాలులు మొదలైపోతుంటుంటే.. ఉదయం 10 దాటినా ఆ తీవ్రత తగ్గడంం లేదు. ఏజెన్సీల్లో చలి గాలుల తీవ్రతకు గిరిజనం వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఈనెల 21వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. రాబోయే మూడ్రోజులూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.
అటు ఏపీలోనూ చలి చంపేస్తోంది. ఇక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చలితోపాలు పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది.. దాంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకు, డుంబ్రిగూడ, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి, మినుములూరు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..