Amit Shah: ఈటల రాజేందర్‌ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజకీయ ఆసక్తి రేపుతున్న ఏకాంత చర్చ..!

|

Sep 17, 2022 | 4:20 PM

తెలంగాణ పర్యటనలో బిజీబిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను షా పరామర్శించారు. హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి చేరుకున్న అమిత్‌షా ఎమ్మెల్యేను పరామర్శించారు.

Amit Shah: ఈటల రాజేందర్‌ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజకీయ ఆసక్తి రేపుతున్న ఏకాంత చర్చ..!
Amit Shah Mla Etela Rajender
Follow us on

Amit Shah meets MLA Etela Rajender: తెలంగాణ పర్యటనలో బిజీబిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను షా పరామర్శించారు. హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి చేరుకున్న అమిత్‌షా ఎమ్మెల్యేను పరామర్శించారు. ఇటీవల ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి 25 నిమిషాలపాటు ఉన్నారు. సుమారు 15 నిమిషాలపాటు అమిత్ షా.. ఈటలతో ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు.. మునుగోడు, పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అమిత్‌షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇటీవల ఆయన అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన విషయంపై కూడా షా మాట్లాడినట్లు సమాచారం. అయితే, తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ అనంతరం ఈటలను పరామర్శించడానికి వెళ్లిన అమిత్ షా.. ఆయనతో ప్రత్యేకంగా ఒంటరిగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో ప్రాథాన్యం సంతరించుకుంది. ఈటలతో అమిత్ షా ఏం మాట్లాడారు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది.. అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమయంలో అమిత్ షా వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ కూడా ఉన్నారు.

అంతకుముంతు అమిత్ షా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్‌షా. పార్టీ కోర్‌ కమిటీ భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తు ఉండొచ్చని, ఆ రెండు పార్టీలు ఎప్పుడైనా ఒక్కటవుతాయనే విషయం మరింత క్లియర్‌గా అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ బలోపేతానికి తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని నాయకులకు భరోసా ఇచ్చారు అమిత్‌షా. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని సూచించారు.

అంతేకాకుండా.. హైదరాబాద్ నగరంలోని బాలంరాయి క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో అమిత్‌షా పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో వికలాంగులు, అంధులకు.. సైకిల్స్, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, మిషన్స్ అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..