AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sagar By-Poll 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై టీఆర్ఎస్ కసరత్తు.. సీటు ఆయనకేనా..?

Nagarjuna Sagar By Election 2021: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉపఎన్నికలపై దృష్టిసారించాయి. ఎలాగైనా

Nagarjuna Sagar By-Poll 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై టీఆర్ఎస్ కసరత్తు.. సీటు ఆయనకేనా..?
Nagarjuna Sagar By-Poll 2021
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2021 | 1:47 PM

Share

Nagarjuna Sagar By Election 2021: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. ఎలాగైనా మళ్లీ నాగర్జున సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నిన్నటినుంచి ఇటు నాగర్జునసాగర్, ఏపీలోని తిరుపతి బైపోల్ ​కోసం నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీనిలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌కే ఈ సీటు కేటాయించాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. నోముల కుటుంబం వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని నాయకులు పేర్కొంటున్నారు. అయితే టీఆర్ఎస్ రేపు అభ్యర్థిని ఫైనల్ చేసి వెంటనే నామినేషన్ వేయాలని చూస్తోంది.

ఈ మేరకు కేసీఆర్ కూడా నల్లగొండ, సాగర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నోముల భగత్‌కే టికెట్ కన్‌ఫాం అయినట్లు పార్టీ కేడర్ ప్రచారం చేస్తోంది. అయితే నోముల భగత్‌తోపాటు.. గురవయ్య, రంజిత్ పేర్లను కూడా టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలించిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నోములకు గుర్తింపుగా భగత్‌కే సీటు కేటాయిస్తే బాగుంటుందని.. పార్టీ ఆలోచిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

నోముల నర్సింహయ్య కన్నుమూసిన అనంతరం సాగర్​ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. మొదట ఇక్కడ యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్ఎస్ ​భావించింది. ఆ తరువాత నోముల కుమారుడితోపాటు పలువురు పేర్లనూ పార్టీ అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో భగత్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌